Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే స్పందించిన పోప్ ఫ్రాన్సిస్.. ఉక్రెయిన్ లో రక్తపు నదులు ప్రవహిస్తున్నాయి. తీవ్ర దుఃఖానికి, విధ్వంసానికి దారితీస్తున్న ఈ యుద్ధాన్ని ఆపండి అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే క్యాథలిక్ చర్చి అధిపతి అయిన పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలోని పీటర్స్ స్క్వేర్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రక్తము, కన్నీళ్లు ఏరులై పారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారణకాండకు కారణమైన ఈ యుద్ధాన్ని ముగించాలని రష్యాకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఆయన ఖండించారు. ‘ఉక్రెయిన్‌లో రక్తం, కన్నీళ్ల నదులు ప్రవహిస్తున్నాయి. ఇది సైనిక చర్య మాత్రమే కాదు.. మరణం, విధ్వంసం, దుఃఖానికి దారితీసే యుద్ధం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధమంటే పిచ్చి.. దయచేసి దీనిని ఆపు అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు పిలుపునిచ్చారు. "ఆ అమరవీరులకు దేశంలో మానవతా సహాయం అవసరం గంట గంటకు పెరుగుతోంది" అని పోప్ అన్నారు.
"యుద్ధం అంటే పిచ్చి! ఆపు, దయచేసి! ఈ క్రూరత్వాన్ని చూడు" అన్నారు పోప్ ఫ్రాన్సిస్. "హోలీ సీ శాంతి సేవలో తనను తాను ఉంచుకోవడానికి ప్రతిదీ చేయడానికి సిద్ధంగా ఉంది" అని పోప్ చెప్పారు. ఇద్దరు రోమన్ కాథలిక్ కార్డినల్స్ అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉక్రెయిన్‌కు వెళ్లారని చెప్పారు. ప్రమాదాలు ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని కవర్ చేసిన విలేకరులకు, అనుభవిస్తున్న క్రూరత్వం మరియు బాధల గురించి నివేదించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. "సమాచారాన్ని అందించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన జర్నలిస్టులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. సోదరులు మరియు సోదరీమణులారా, ఆ జనాభా యొక్క విషాదానికి దగ్గరగా ఉండటానికి మరియు ఒక వ్యక్తి క్రూరత్వాన్ని అంచనా వేయడానికి మాకు సహాయపడే ఈ సేవకు ధన్యవాదాలు" అని చెప్పాడు.
ఇదిలావుండగా, ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా (Russia) ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై (Ukraine) బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, రష్యా బలగాలకు ఉక్రెయిన్ ధీటైన సమాధానంతో ముందుకు సాగుతోంది. అయినప్పటికీ రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని ప్రధాన ప్రాంతాలను, కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటూ.. ఆ దేశంపై పట్టుసాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యాను ప్రపంచ దేశాలు హెచ్చిరిస్తూ.. మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తూ.. రష్యాను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్నాయి.
