Asianet News TeluguAsianet News Telugu

బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలో ఉద్యోగం: నెలకు 26 లక్షలు వేతనం, అర్హతలివే

బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ. ప్రపంచవ్యాప్తంగా క్వీన్ ఎలిజబెత్-2 ఉనికిని మరింత గొప్పగా ఫోకస్ చేసే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ది బ్రిటీష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ తన జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

wanted: social media manager for queen elizabeth ii
Author
London, First Published May 22, 2019, 12:09 PM IST

బ్రిటీష్ రాజ కుటుంబం కోసం పనిచేయాలనుకుంటున్నారా..? అలాంటి వారికి అవకాశం కల్పించింది. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ. ప్రపంచవ్యాప్తంగా క్వీన్ ఎలిజబెత్-2 ఉనికిని మరింత గొప్పగా ఫోకస్ చేసే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ది బ్రిటీష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ తన జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

కొత్తగా ఎంపికైన మీడియా మేనేజర్ రాణిగారిని కొత్తగా సోషల్ మీడియాలో ప్రెజంట్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన సరికొత్త మార్గాలను అన్వేషించాలి. ఇందుకు గాను నెలకు 30 వేల బ్రిటీష్ పౌండ్లు (భారత కరెన్సీలో రూ.26,57,655) వేతనంగా చెల్లించబడుతుంది.

దీనికి తోడు జీతంలో 15 శాతం పెన్షన్ పథకం, 33 రోజుల వార్షిక సెలవులు (బ్యాంక్ సెలవులతో కలిపి). ఉచిత భోజనం, వారానికి ఐదు రోజులే పని దినాలు. ఇక ఈ ఉద్యోగానికి అర్హతలు డిగ్రీతో పాటు వెబ్‌సైట్‌లో పనిచేసిన అనుభవం, అద్భుతమైన ప్లానింగ్ ఫోటోగ్రఫీ, వీడియో నైపుణ్యాలు చాలా అవసరం, ప్రాధాన్యతలను బట్టి చురుకుగా స్పందించాలి.

డిజిటల్, సోషల్ మీడియా కంటెంట్‌ను క్రియేట్ చేయాలి. లేటెస్ట్ డిజిటల్ కమ్యూనికేషన్స్ డెవలప్‌మెంట్స్ మీద పూర్తిగా పట్టు వుండాలి. డిజిటల్ కంటెంట్ రూపకల్పనలో నైపుణ్యంతో పాటు రైటింగ్ స్కిల్స్ ఉండాలి. రోజువారీ వార్తా విశేషాలను, ఫీచర్ కథనాలను గమనించాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios