వెనెజులా అధ్యక్షుడిపై హత్యాయత్నం.. డ్రోన్లకు బాంబులు.. తప్పించుకున్న దేశాధినేత

First Published 5, Aug 2018, 12:26 PM IST
Venezuela President Nicolas Maduro drone attack
Highlights

వెనెజులా దేశాధ్యక్షుడు నికోలస్ మాదురోపై హత్యాయత్నం జరిగింది. ఆయుధాలతో నిండిన రెండు డ్రోన్లు అధ్యక్షుడికి అతి సమీపంలో పేలిపోయాయి. ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు

వెనెజులా దేశాధ్యక్షుడు నికోలస్ మాదురోపై హత్యాయత్నం జరిగింది. ఆయుధాలతో నిండిన రెండు డ్రోన్లు అధ్యక్షుడికి అతి సమీపంలో పేలిపోయాయి. ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.

నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా రాజధాని కరాకస్ వేలాది మంది సైనికులను ఉద్ధేశించి దేశాధ్యక్షుడు నికోలస్ ప్రసంగిస్తుండగా.. పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లు పెద్ద శబ్ధంతో ఆయనకు సమీపంలో పేలాయి. దీంతో అక్కడికి వచ్చిన సైనికులు, పౌరులు ప్రాణభయంతో పరుగులు తీశారు.. ఈ తతంగమంతా సీసీ టీవీల్లో రికార్డ్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నికోలస్‌ను సురక్షితంగా వేదిక బయటకు తీసుకువచ్చారు.

పేలుడులో 9 మంది వరకు గాయపడి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ దాడి వెనుక పొరుగుదేశం కొలంబియా, అమెరికాతో పాటు ప్రతిపక్షాలు ఉన్నాయని మాదురో ఆరోపించారు. దాడి ఘటనపై ఆ దేశ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

loader