Asianet News TeluguAsianet News Telugu

పెంచుకోవ‌డానికంట‌.. విమానాశ్రయంలో మహిళ క్యారీ లగేజీలో 4 అడుగుల పాము.. !

Florida: ఫ్లోరిడాలోని ఒక ప్రయాణికురాలు పెద్ద పామును త‌న‌తో పాటు విమానంలోకి తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించింది. దాదాపు అన్ని చెకింగ్ లు పూర్తయ్యాక‌.. విమానం ఏక్కే స‌మ‌యంలో బ్యాగులో నిర్బంధించ‌బ‌డిన పామును రవాణా భద్రతా అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.
 

USA : 4 feet snake in woman's carry on luggage at Florida airport
Author
First Published Jan 10, 2023, 2:09 PM IST

Florida Airport-Snake: అమెరికాకు చెందిన ఒక మ‌హిళ తాను పెంచుకోవ‌డానికి ఒక పామును ఎంచుకుంది. ఈ క్ర‌మంలోనే దానికి ద‌గ్గ‌ర‌యిన ఆ మ‌హిళ‌.. త‌న‌తో పాటు తీసుకెళ్ల‌డానికి విమానం ఎక్క‌బోయింది. నాలుగు అగుడులున్న ఆ పామును చివ‌ర‌కు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌యాణికురాలిని అధికారులు ప్ర‌శ్నించ‌గా వ‌చ్చిన సమాధానంపై నెట్టింట ఆస‌క్తిక‌ర కామెంట్లు వ‌స్తున్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. ఒక పామును త‌న‌తో పాటు తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించిన అమెరికా మ‌హిళ‌.. ఆ పామును ఒక బ్యాగులో బంధించి పెట్టింది. ఆ పామును విమానంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఎంట్రెన్స్ గేటు వద్ద తప్పించుకుని విమానాశ్రయంలోకి వెళ్లింది. ఇంకా కొద్ది దూరం వెళ్తే విమానం ఎక్కేసేది. కానీ అధికారులు ఎక్స్‌-రే మిష‌న్ వ‌ద్ద గుర్తించ‌డంతో దొరికిపోయింది. బ్యాగును స్కాన్ చేసిన సెక్యూరిటీ సిబ్బందికి అనుమాన‌స్ప‌దంగా అనిపించ‌డంతో దానిని తెర‌చిచూడ‌గా లోపల పామును చూసి షాక్ అయ్యారు. ఫ్లోరిడాలోని టాంపా ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న ఈ సం ఘటన వైర‌ల్ అవుతోంది. 

 

పాము గురించి స‌ద‌రు మ‌హిళ‌ను అధికారులు ప్ర‌శ్నించారు. ఎమోషనల్‌గా దగ్గరయ్యానని, అందుకే పెంచుకునేందుకు తీసుకెళ్తున్న‌ట్టు చెప్పిన ఆ మ‌హిళ‌.. త‌న పామును ముద్దుగా 'బార్తోలోమ్యూ' అని పిలిచుకుంటున్న‌ట్టు చెప్పారు.  మొద‌ట ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రయాణికుడి సామాను లోపల బోవా కన్‌స్ట్రిక్టర్ (పాము)ను కనుగొన్న తర్వాత ఫ్లోరిడాలోని ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ ఎక్స్-రే చిత్రాన్ని TSA షేర్ చేసింది. ఇది డిసెంబర్ 15న టంపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళ క్యారీ-ఆన్‌లో 4-అడుగుల బోవా కన్‌స్ట్రిక్టర్ క‌నిపించింది. 

డిసెంబర్‌లో టంపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళ లగేజీలో 4 అడుగుల బోవా కన్‌స్ట్రిక్టర్ ఉంది. ఎక్స్-రేలో పాము కనిపించిన విషయాన్ని అధికారులు మహిళకు తెలియజేసినప్పుడు, అది తన ఎమోషనల్ సపోర్ట్ పెంపుడు జంతువు అని అధికారులకు చెప్పింది. తర్వాత ఎయిర్‌లైన్‌ని సంప్రదించగా, పామును విమానంలో ఎగరడానికి అనుమతించలేదని TSA USA TODAYకి ఒక ప్రకటనలో తెలిపింది.

కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు వాటి యజమానులతో ప్రయాణించడానికి అనుమతించబడతాయి, అయితే వాటిని ఎప్పుడూ ఎక్స్-రే యంత్రం ద్వారా పెట్టకూడదని  TSA చెబుతోంది . నవంబర్‌లో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ చేయబడిన సామాను లోపల ఒక పిల్లిని అధికారులు గుర్తించారు. అలాగే, డిసెంబరులో  విస్కాన్సిన్ విమానాశ్రయంలో అనుకోకుండా ఎక్స్-రే ద్వారా పంపబడిన ఒక  క్యారీ-ఆన్ బ్యాక్‌ప్యాక్ లోపల ఒక కుక్కను సైతం అధికారులు గుర్తించారు. అయితే, ప్ర‌యాణికులు త‌మ వెంట జంతువుల‌ను, పాముల‌ను తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌గా, ఇదివ‌ర‌కు అధికారులు చాలా సార్లు గుర్తించారు. అయితే, తాజాగా ఫ్లోరిడా విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికురాలి బ్యాగులో అధికారులు గుర్తించిన పాము విష‌పూరిత‌మైన‌ది కాదు. దీంతో అక్క‌డి వారిలో చాలా మంది దీనిని పెంపుడు జంతువుగా పెంచుకుంటారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios