విదేశీయులకు నో ఎంట్రీ: డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్ ను సస్పెండ్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
వాషింగ్టన్: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కనిపించని శత్రువు దాడి చేస్తున్న నేపథ్యంలో, గ్రేట్ అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడే ఉద్దేశంతో, అమెరికాకు తాత్కాలికంగా ఇమిగ్రేషన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దానివల్ల విదేశీయులు అమెరికాలోకి ప్రవేశించలేరు.
అమెరికాలో కరోనా వైరస్ వినాశనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. లక్షలాది మంది కరోనా వైరస్ బారిన పడుతూ, వేలాది మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. అమెరికాలో 7 లక్షల మందికి పైగా కరోనా వైరస్ తో బాధపడుతున్నారు.