ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అలాగే క్రమశిక్షణకు మారు పేరైన అమెరికా నావికా దళంలో పనిచేస్తున్న కొందరు అధికారులు తోటి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారు.

శరీరాకృతి, క్యారెక్టర్‌ను బట్టి వారికి రేటింగ్ ఇస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... యూఎస్ఎస్ ఫ్లోరిడా గైడెడ్ సబ్‌మెరైన్ మహిళా ఉద్యోగులను నియమించుకున్న రెండో సబ్‌మెరైన్‌‌గా రికార్డుల్లోకి ఎక్కింది.

ఇందులోకి 173 మంది ఉద్యోగులను తీసుకోగా.. వీరిలో 32 మంది మహిళా క్రూ మెంబర్స్‌ ఉన్నారు. వీరిని గతేడాది ఫిబ్రవరిలో విధుల్లోకి తీసుకున్నారు. నాలుగు నెలల పాటు అధికారులు అందరితోనూ కలిసి మెలిసి ఉన్నారు.

ఆ తర్వాత వారిలో వికృత కోరికలు నిద్రలేచాయి. కొందరు అధికారులు మహిళా ఉద్యోగులను వారి శరీరాకృతి, క్యారెక్టర్ వంటి అంశాల ఆధారంగా రెండు భాగాలుగా విభజించి దానికి రేప్‌ లిస్ట్ అని పేరు పెట్టారు.

ఈ లిస్ట్‌లో పేర్కొన్న మహిళలపై అత్యాచారాం చేయాలని వెల్లడించారు. మరో లిస్ట్‌లోకి ఇంకొందరు మహిళల పేర్లను చేర్చి వారి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లుగా మిలటరీ. కామ్ అనే రక్షణ రంగ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది.

ఈ వ్యవహారంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో .. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.