వాషింగ్టన్: క్రిస్మస్ పర్వదినానికి రెండు రోజుల ముందు ఓ తెల్ల గడ్డం వ్యక్తి బ్యాంకును దోచేసి, జనంపైకి డబ్బులు వెదజల్లాడు. వారికి మెర్రీ క్రిస్మస్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వార్తాకథనం అమెరికా మీడియాలో వచ్చింది. 

ఓ తెల్లగడ్డం వృద్ధుడు కోలొరడా స్ప్రింగ్స్ లోని ఆకాడమీ బ్యాంకులోకి ప్రవేశించి ఆయుధంతో ఉ్దద్యోగులను బెదిరించి డబ్బులు తీసుకుని పారిపోయాడని, ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగిందని పోలీసులు చెప్పారు. 

తన సంచీలోంచి డబ్బులు తీసి జనంపైకి వెదజల్లుతూ మెర్రీ క్రిస్సమ్ చెప్పాడని వారన్నారు. నిందితుడిని పోలీసులు 65 ఏళ్ల డేవిడ్ వెయినే అలివర్ గా గుర్తించారు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసినప్పుడు అలివర్ వద్ద ఆయుధం లేదని చెప్పారు. 

కొంత మంది డబ్బును తిరిగి బ్యాంకుకు ఇచ్చేశారని, అయితే, వేలాది డాలర్లు పోయాయని బ్యాంక్ అధికారులు చెప్పారు.