Asianet News TeluguAsianet News Telugu

ఇస్లామిక్ స్టేట్ సభ్యుడిపై అమెరికా వైమానిక దాడి..!

కాబూల్ విమానాశ్రయం ద్వారాల వెలుపల గురువారం జరిగిన ఆత్మాహుతి పేలుళ్లకు ఆ వ్యక్తి ప్రత్యేకంగా సంబంధం ఉందా అనే విషయంపై స్పష్టత లేదు. 

US Drone Strike Targets ISIS "Planner" After Deadly Kabul Blasts
Author
Hyderabad, First Published Aug 28, 2021, 8:16 AM IST


ఆప్ఘనిస్తాన్ లో ఐసిస్ ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. జంట పేలుళ్లకు పాల్పడి వందల మంది ప్రాణాలు కోలపోవడానికి కారణమయ్యారు. కాగా... ఈ ఘటనపై అమెరికా చాలా ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసిస్ స్టావరాలపై వైమానిక దాడికి పాల్పడింది.

అఫ్గానిస్థాన్ ​నంగహర్‌లో ఐసిస్ సభ్యునిపై వైమానిక దాడి చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్​ హెచ్చరికలు జారీ చేసిన తదుపరి రోజే ఈ చర్యలకు ఉపక్రమించింది. ఈ దాడిలో ఒక ఐసిస్ సభ్యుడు మరణించాడని, పౌర ప్రాణనష్టం గురించి తమకు తెలియదని నేవీ కెప్టెన్ విలియం అర్బన్ చెప్పారు.  కాబూల్ విమానాశ్రయం ద్వారాల వెలుపల గురువారం జరిగిన ఆత్మాహుతి పేలుళ్లకు ఆ వ్యక్తి ప్రత్యేకంగా సంబంధం ఉందా అనే విషయంపై స్పష్టత లేదు. 

కాగా కాబుల్​ ఎయిర్‌పోర్ట్ వద్ద గురువారం జరిగిన జంట పేలుళ్ల ఘటనలో 180మందికిపైగా మృతి చెందారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ వదిలిపెట్టమని.. వెంటాడి చంపుతామని బైడెన్​ హెచ్చరించారు. ఈ ఆత్మాహుతి దాడుల తర్వాత.. ఉగ్రవాదులు కాల్పులు కూడా జరిపారంటూ అమెరికా అధికారులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios