వాషింగ్టన్: చైనాకు అమెరికా మరో షాకిచ్చింది. సుమారు వెయ్యి మంది వీసాలను అమెరికా రద్దు చేసింది. చైనా విద్యార్థులు, పరిశోధకులనను తమ దేశంలోకి అనుమతించకుండా నిరోధించే ప్రక్రియకు అమెరికా చెక్ పెట్టింది.

జాతీయ భద్రతకు విఘాతం కల్గించే శక్తులను తమ దేశంలోకి అనుమతించబోమని ఈ ఏడాది మే 29వ తేదీన అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంలో భాగంగానే  చైనీయులకు తమ దేశంలోకి అనుమతిని నిషేధిస్తూ అమెరికా ప్రకటించింది.

తమ దేశానికి చెందిన కీలక అంశాలను సైనికాధికారులతో చైనా విద్యార్థులు, పరిశోధకులు చేరవేస్తున్నారని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ముఖ్యకార్యదర్శి ఛాడ్ వోల్ఫ్  ప్రకటించారు.

తమ దేశానికి సంబంధించిన సమాచారం ఇతర దేశాలకు చేరకుండా ఉండేందుకు గాను ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.అమెరికా తీసుకొన్న నిర్ణయం మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీ నాటికి 10043 మందిని గుర్తించారు. వీరిలో వెయ్యి మంది వీసాలను రద్దు చేశారు.అమెరికాలో తమ విద్యార్థులపై విధిస్తున్న ఆంక్షలను చైనా తీవ్రంగా ఖండించింది.