Asianet News TeluguAsianet News Telugu

అల్ ఖైదా చీఫ్‌ హతం.. ప్రపంచ దేశాలన్నింటికీ అమెరికా అలర్ట్

అల్ ఖైదా చీఫ్ అల్ జవహిరిని అమెరికా అంతమొందించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు పంపింది. ఉగ్రదాడులకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఉండవని, కాబట్టి, అందరూ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా అమెరికా పౌరులు ఎక్కడికి ప్రయాణం చేసినాా.. మరెక్కడో ఉన్నా జాగరూకతగా ఉండాలని సూచించింది.
 

US alert for across world after al qaeda chief ayman al zawahiri killing
Author
New Delhi, First Published Aug 3, 2022, 3:27 PM IST

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం అల్ ఖైదా చీఫ్ అమాన్ అల్ జవహిరిని హతమార్చినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. యూఎస్ డ్రోన్ అటాక్‌తో అఫ్ఘనిస్తాన్‌లో తలదాచుకున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహిరిని అంతమొందించినట్టు తెలిపారు. సీఐఏ ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన డ్రోన్ ద్వారా ఈ ఆపరేషన్ విజయవంతం చేశారు.

అల్ ఖైదా చీఫ్ అమాన్ అల్ జవహిరిని హతమార్చామని, 9/11 దాడి బాధితులకు న్యాయం సమకూర్చామని బైడెన్ తెలిపారు. ఈ సందర్భంలోనే అమెరికా ప్రపంచ దేశాలన్నింటికీ అలర్ట్ మెస్సేజీ పంపింది. అల్ జవహిరి మరణాన్ని ప్రకటించిన తర్వాత జో బైడెన్ ప్రపంచదేశాలకు హెచ్చరికలు పంపారు. 

అల్ ఖైదా మద్దతుదారులు, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు అమెరికాలోని వసతులు, పౌరులు, 
అధికారులను చంపేయాలని ఆలోచనలు చేసే అవకాశం ఉంటుందని, ప్రమాదం ఉన్నదని అమెరికా అదే రోజు ప్రకటనలో పేర్కొంది. టెర్రరిస్టు దాడులకు సాధారణంగా ముందస్తు హెచ్చరికలు ఉండవని, అయినా, వాటిని ఎదుర్కోవడానికి పౌరులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని వివరించారు. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడూ అమెరికా పౌరులు జరింత జాగ్రత్తగా మసులుకోవాలని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios