ఉరుగ్వేయన్ బ్యూటీ క్వీన్ ఫాతిమివ్ డేవిలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మెక్సికోలోని ఓ హోటల్ లో గురువారం బస చేసిన ఆమె... అదే హోటల్ బాత్రూమ్ లో చనిపోయి ఉండటం గమనార్హం. దీనిని గమనించిన హోటల్ సిబ్బంది వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు.

ఉరుగ్వేయన్ కి చెందిన ఫాతిమివ్(31)... ఆ దేశం తరపున మిస్‌ యూనివర్స్‌, మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొన్నారు. వృత్తిరీత్యా మోడల్‌ అయిన డేవిలా మెక్సికోలో నివాసముంటోంది. మోడలింగ్‌ విషయమై గత నెల 23న మెక్సికోలోని ఓ హోటల్‌లో ఆమె దిగారు.

అకస్మాత్తుగా మే 2వ తేదీన ఆమె బాత్రూమ్ లో శవమై తేలారు. ఆమెది హత్యా, ఆత్మహత్య అన్న కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని.. హత్యే అయ్యి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఆమె అకస్మాత్తు మరణం.. ఆమె అభిమానులను కలచివేసింది.