Asianet News TeluguAsianet News Telugu

రాత్రికి రాత్రే ఏదైనా జరగొచ్చు.. ‘తాలిబన్​’ పదాన్ని తొలగించిన ఐరాస భద్రతా మండలి

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పట్ల ఐక్యరాజ్యసమితి విచిత్రంగా ప్రవర్తిస్తోంది. రోజుల వ్యవధిలో రెండు రకాలుగా తన ప్రకటనను వెలువరించింది. ఇందుకు సంబంధించి ఐరాసలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. 

unsc removes taliban from its statement
Author
New York, First Published Aug 29, 2021, 2:37 PM IST

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు ఎంత ఆందోళనకరంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన మరుసటిరోజే అంటే.. ఈ నెల 16న భద్రతా మండలి ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదంపై పోరుకు భద్రతా మండలి సభ్యులందరూ ప్రాధాన్యతనిచ్చారు. ఆఫ్ఘాన్ గడ్డపై నుంచి ఏ దేశం మీదా ఉగ్రవాద దాడులు జరగకూడదు. తాలిబన్లుగానీ, ఇతర ఆఫ్ఘనిస్థాన్ సంస్థలు గానీ అక్కడ ఉగ్రవాదాన్ని గానీ, ఉగ్రవాదుల్నిగానీ ప్రోత్సహించరాదు’’ అని ఆ ప్రకటనలో భద్రతా మండలి పేర్కొంది.

ALso Read:ఇండియాను కౌంటర్ చేయడానికే పాక్ తాలిబాన్‌కు జన్మనిచ్చింది: అఫ్ఘాన్ మాజీ దౌత్య అధికారి

అయితే, తాజాగా ఆ ప్రకటనను  ఐరాస మార్చింది. ‘తాలిబన్లు గానీ’ అన్న ఒక్క పదాన్ని తీసేసి మిగతా ప్రకటననంతా సేమ్ టు సేమ్ ఉంచేసింది. ఈ మార్పులకు కారణం.. విదేశీయుల తరలింపులకు తాలిబన్లు సహకరిస్తుండడమేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి అవాంతరాలు లేకుండా విదేశీయుల తరలింపు జరిగిందని, దానికి తాలిబన్ల నుంచి సహకారం అందిందని అధికారులు అంటున్నారు. పాత, కొత్త ప్రకటనలను ఐక్యరాజ్యసమతిలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ‘‘దౌత్య సంబంధాల్లో రాత్రికి రాత్రే ఏదైనా జరిగిపోవచ్చు. ‘టీ’ పదం పోయింది. ఐరాస భద్రతా మండలి ప్రకటనలను ఓసారి చూడండి’’ అంటూ ట్వీట్ చేశారు

 

Follow Us:
Download App:
  • android
  • ios