మాస్కో:  ప్రతిపక్షనాయకుడు అలెక్సీ నావల్నీ విడుదల కోసం రష్యాలో పలు చోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. నావల్నీ వెంటనే జైలు నుండి విడుదల చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున  నిరసనలకు దిగారు. 

ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా వేలాది మంది  వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిన విద్యార్ధులు, ప్రజలు స్వచ్ఛంధంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

నిరసనకారులను చెదరగొట్టేందుకు పలు చోట్ల పోలీసులు లాఠీచార్జీకి దిగారు.నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న సుమారు 3 వేల మందిని అదుపులోకి తీసుకొన్నారు.అరెస్టైన వారిలో నావల్నీ భార్య యూలియా కూడ ఉన్నారు. రష్యాలోని మొత్తం 90 నగరాల్లో నిరసన కార్యక్రమాలు చోటు చేసుకొన్నాయి.

2014 నావల్నీ ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఆయనపై విష ప్రయోగం కూడ జరిగింది.ఈ నెల 17న ఆయన ఎయిర్ పోర్ట్ లో దిగగానే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొన్నారు.