Asianet News TeluguAsianet News Telugu

విచిత్రం.. గర్భం వచ్చినట్టే తెలియదు.. పీరియడ్ పెయిన్ అనుకుని బాత్రూంకు వెడితే ప్రసవం..

యూకేలో ఓ నమ్మశక్యంకాని సంఘటన జరిగింది. ఓ యూనివర్సిటీ విద్యార్థిని తనకు తెలియకుండానే ఓ చిన్నారికి జన్మనిచ్చింది. నెలవారీ పీరియడ్స్ పెయిన్ అనుకుని బాత్రూంకి వెళ్లిన ఆమెకు.. డెలివరీ అయ్యింది. దీంతో షాక్ అవ్వడం ఆమె వంతయ్యింది. 

University Student In UK Goes To Toilet With Stomach Pain, Gives Birth To Baby
Author
Hyderabad, First Published Jun 27, 2022, 2:03 PM IST

యూకే : యూకేలోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయంలో రెండవ సంవత్సరం చదువుతున్న 20యేళ్ల జెస్ డేవిస్ కు ఈ విచిత్రమైన పరిస్థితి ఎదురయ్యింది. ముందు పొత్తి కడుపులో నొప్పి వస్తుంటే పీరియడ్స్ మొదలయ్యాయనుకుంది. బాత్రూంకు వెళ్లాలని అనిపించడంతో టాయ్ లెట్ కి వెళ్లింది. అక్కడ భరించలేని నొప్పితో ప్రసవించింది. చిన్నారి ఏడుపు విన్న తరువాత కానీ తనకేమయిందో ఆమెకు అర్థం కాలేదు. 

వివరాల్లోకి వెడితే... సౌతాంప్టన్ విశ్వవిద్యాలయంలో చరిత్ర, రాజకీయాలు రెండవ సంవత్సరం చదువుతున్న జాన్ డెవిస్ కు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తాయి. దీంతో ఆమెకు చివరి సారి పీరియడ్ ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు. అంతేకాదు ఆమెకు ఎలాంటి గర్భధారణ లక్షణాలు కానీ, బేబీ బంప్ కానీ లేవు. దీంతో ఎప్పట్లాగే ఉంది. తెల్లారి తన పుట్టినరోజు కావడంతో ఆ రోజు రాత్రికి ఇంట్లో హౌజ్ పార్టీ అరెంజ్ చేసింది. 

జూన్ 11న ఈ ఘటన జరిగింది. అప్పటికే కాస్త పొత్తికడుపులో నొప్పిగా ఉండడంతో పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయనుకుంది. అయితే, కాస్త స్నానం చేసి ఫ్రెష్ అయితే.. ఆ నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుందనుకుని బాత్రూంలోకి వెళ్లింది. ఇంతలో నొప్పులు ఎక్కువయ్యాయి. యోనిలో నుంచి ఏదో బైటికి వస్తున్నట్లు అనిపించింది. అదేంటో తనకు తెలియదు కానీ.. అది బైటికి రాకపోతే చచ్చిపోతానన్నంత నొప్పి వేసింది. 

దక్షిణాఫ్రికాలో విషాదం.. బార్ లో 21మంది టీనేజర్లు మృతి, విషప్రయోగం అనుమానాలు...

కాసేపటికి అది బైటికి వచ్చింది. పెయిన్ కాస్త రిలీఫ్ నిచ్చింది. ఇంతలో చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది. చూస్తే తాను ఓ చిన్నారికి జన్మనిచ్చింది. అది చూసి మొదట డేవిస్ షాక్ అయ్యింది. ఇదంతా కలేమో అనుకుంది. కానీ వాస్తవమే అని తెలియడానికి కాస్త సమయం పట్టింది. వెంటనే తన స్నేహితురాలు లివ్ కింగ్‌కి  ఫోన్ చేసింది. అయితే, రాత్రి ఇచ్చే పార్టీ ఎగ్గొట్టడానికి బహానా చెబుతుందనుకుంది ఆ స్నేహితురాలు. కానీ నవజాత శిశువు ఫొటో పంపండంతో నమ్మింది. వెంటనే ఆస్పత్రి అంబులెన్స్ కు ఫోన్ చేయమని చెప్పి తాను కూడా వెంటనే డేవిస్ గదికి చేరుకుంది. 

అంబులెన్స్ వచ్చి తల్లీ, బిడ్డలను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. శిశువు దాదాపు 3 కిలోల బరువుతో ఉన్నాడు. ఇలా సడెన్ గా ప్రసవించడంతో శిశువుతో ఎలా అనుబంధం పెంచుకోవాలో మొదట తనకు అర్థం కాలేదని.. కానీ ఇప్పుడు తన కొడుకు మీద ప్రేమ పొంగుతోందని ఆమె చెబుతోంది. ఆస్పత్రి వర్గాలు శిశువును వెంటనే ఇంక్యుబెటర్ ఉంచి..జాగ్రత్తగా చూసుకుంటున్నారు. శిశుకు 35 వారాల వయసు ఉంటుందని చెబుతున్నారు. బాబు ఎప్పుడూ.. పెద్దగా ఏడవడని అందుకే వార్డులో అందరూ ఆ చిన్నారిని సైలెంట్ కిడ్ అని పిలుస్తారని తెలిపింది డేవిస్. ప్రస్తుతం తల్లి, బిడ్డ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios