వాషింగ్టన్: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  ఓ విమానం ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన పైలైట్ విమానాన్ని జాగ్రత్తగా ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. ఈ విమానంలో ప్రయాణీస్తున్న వారికి ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని  అధికారులు ప్రకటించారు.

యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన 328 విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే విమానంలో మంటలు రావడంతో డెన్వార్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది.డెన్వార్ నుండి హునోలులుకు బయలుదేరిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.విమానంలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది.

విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఈ విమానంలో సుమారు 231 మంది ప్రయాణీకులున్నారు. అంతేకాదు మరో 10 మంది విమాన సిబ్బంది ఉన్నారని ఎయిర్ లైన్స్ విభాగం అధికారులు తెలిపారు.ఈ విమానం ఇంజన్ లో మంటలు అంటుకొన్న దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.