Ukraine Russia Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో వారం రోజుల లోపల సాధారణసభ ప్రవేశపెట్టిన తీర్మానాలకు భారత్ గైర్హాజరుకావడం ఇది మూడవసారి.
Ukraine Russia Crisis: యావత్ ప్రపంచం ఉక్రెయిన్ పై రష్యా దాడి గురించే చర్చించుకుంటోంది. గత వారం రోజులుగా రష్యా .. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్ సహా చాలా నగరాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం విరమించాలని.. అమాయకుల ప్రాణాలు పోతున్నాయని..ప్రపంచ దేశాలు మొత్తకుంటున్నాయి. అయినా రష్యా అధ్యక్షుడు మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో రష్యా వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ.. వెంటనే ఉక్రెయిన్ నుండి రష్యా బలగాలను వైదొలగాలని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు బుధవారం UN జనరల్ అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని అత్యధికంగా దేశాలు ఆమోదించాయి.
ఉక్రేనియన్ పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ.. బుధవారం UN జనరల్ అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా.. 141 సభ్యదేశాలు ఓటు వేశాయి. ఈ తీర్మానానికి 35 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇందులో చైనా కూడా ఉంది. కేవలం ఐదుదేశాలు ఎరిట్రియా, ఉత్తర కొరియా, సిరియా, బెలారస్, రష్యా మాత్రమే రష్యా దాడిని సమర్థించాయి. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.
ఈ తీర్మాన సమయంలో అణు దళాలను అప్రమత్తంగా ఉంచాలనే నిర్ణయాన్ని ఖండించారు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఓటింగ్‌కు ముందు ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లిత్సా యూ ఎన్ అసెంబ్లీలో మాట్లాడారు. మయన్మార్ నుండి వెనిజులా వరకు దేశాలలో నిరంకుశత్వం పెరుగుతున్నది, ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఘంటాపథం అని దౌత్యవేత్తలు అభివర్ణించారు. భయాందోళనకు గురైన ఉక్రేనియన్లు పారిపోతున్న సమయంలో పుతిన్ బలగాలు కైవ్‌పై దాడి చేశాయి. ఉక్రెయిన్ హక్కును రష్యా హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా లక్ష్యం ఆక్రమణ మాత్రమే కాదని.. ఇది ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టమైంది. ఇది మారణహోమమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ప్రారంభించింది. UN చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారం.. ఈ దాడిని రష్యా "ఆత్మ రక్షణ గా అభివర్ణించారు. అయితే రష్యా చార్టర్‌లోని ఆర్టికల్ 2ను ఉల్లంఘిస్తోందని, రష్యా ఆరోపణలను పాశ్చాత్య దేశాలు పూర్తిగా తిరస్కరించాయి. UN సభ్యులు సంక్షోభాన్ని పరిష్కరించడానికి చర్చలే సరైన మార్గమని.. బలప్రయోగానికి దూరంగా ఉండాలని కోరుతున్నారు.
ఐక్యరాజ్యసమితి తన అణు దళాలను అప్రమత్తంగా ఉంచాలనే పుతిన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు స్పష్టం చేస్తుంది, ఈ చర్య పశ్చిమ దేశాల నుండి తక్షణ నిరసనను రేకెత్తించింది. దాదాపు ప్రతి జనరల్ అసెంబ్లీ స్పీకర్.. రష్యా దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో యుఎస్ రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి ఉద్దేశ్యం ఒకటేననీ.. అదే యుద్ధాన్ని తక్షణమే నిరోధించడం" అని యుఎస్ రాయబారి అన్నారు.
రష్యా తన క్రూరత్వాన్ని పెంచడానికి సిద్ధమవుతోందని ఆమె ఆరోపించారు. రష్యన్ బలగాల దాష్టీకాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. రష్యా ఏవిధంగా ఆయుధాలను ఉక్రెయిన్‌లోకి తరలిస్తుందో పలు వీడియోల్లో చూశామనీ, ఇందులో క్లస్టర్ ఆయుధాలు, వాక్యూమ్ బాంబులు ఉన్నాయనీ, ఈ ఆయుధాలు జెనీవా కన్వెన్షన్ ప్రకారం నిషేధించబడ్డాయని థామస్-గ్రీన్‌ఫీల్డ్ చెప్పారు. ఇదిలా ఉంటే.. రష్యా దాడిని బెలారస్ గట్టిగానే సమర్థిస్తుంది.
ఓటింగ్ కు చైనా, భారత్‌కు దూరం
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో వారం రోజుల లోపల సాధారణసభ ప్రవేశపెట్టిన తీర్మానాలకు భారత్ గైర్హాజరుకావడం ఇది మూడవసారి. జపాన్, న్యూజిలాండ్ లు ఆసియా నుండి నాయకత్వం వహించాయి,భారత్‌తోపాటుచైనా, భారతదేశం, పాకిస్తాన్ (35) దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
