Russia Ukraine Crisis: ఉక్రెయిన్ మీద రష్యా భీకర యుద్దం చేస్తుంది. ఈ తరుణంలో సామాన్యులపై అక్కసు వెల్లగక్కుతుందో రష్యా సైన్యం. ఎలాంటి జాలి దయ లేకుండా.. సామ్యానులు ప్రయాణిస్తున్న కారుపైకి యుద్ద ట్యాంకును ఎక్కించింది రష్యాన్ ఆర్మీ. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ మీద రష్యా భీకర యుద్దం చేస్తుంది.రష్యన్ దళాలు ఉక్రెయిన్ పై విరుచుకపడుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ.. బాంబుల వర్షాన్ని కురుపిస్తున్నాయి. ఇప్పటికే పలు కీలక ప్రాంతాలను రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ క్రమంలో ఇరుసేనాల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. సైనిక దాడులు, బాంబుల దాడి మోత, వైమానిక దాడులు, మోగుతున్న సైరన్లతో రాజధాని కీవ్ నగరం చిగురుటాకులా వణికిపోతుంది. ఏ క్షణంగా ఏం జరుగుతుందోనని నగర ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
అయితే.. ఈ తరుణంలో రష్యాన్ బలగాల సైనిక చర్య దారి తప్పుతుందా? అంటే.. అవుననే సమాధానం వస్తుంది. అందుకు ఎన్నో సాక్ష్యులు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఉక్రెయిన్ రాజధాని కైవ్ వీధుల్లో రష్యా బలాగాలు చేస్తున్న వికృత క్రీడాకు సాక్ష్యంగా నిలిచింది. ఎలాంటి జాలి దయ లేకుండా.. దారుణాలకు పాల్పడుతున్నాయి అనడానికి ఆధారంగా నిలిచింది. సామాన్య పౌరులపై రష్యా సైన్యం చేస్తున్న దాష్టికానికి రూపంగా నిలిచింది. నగరాన్ని విధ్వంసం చేసే క్రమంలో రష్యా బలాగాలు తమ పాత వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?
ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో రష్యన్ సైన్యాలు భారీ మొత్తంలో నగరంలో మోహరించాయి. ఈ క్రమంలో యుద్ద ట్యాంకులు నగరంలోకి దూసుక వచ్చాయి. ఈ క్రమంలో రష్యన్ బలాగాలు సామాన్య పౌరుల మీద కూడా స్వైర విహారం చేస్తున్నాయి. కసితో ప్రాణాలు చేసే ప్రయత్నించారు. రష్యా కు చెందిన ఓ యుద్ద ట్యాంకు ఉద్దేశపూర్వకంగా సామాన్య ప్రజలు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసింది. ఎలాంటి జాలి దయ లేకుండా.. ఆ కారుపైకి యుద్ద ట్యాంకర్ ను ఎక్కించింది రష్యాన్ సైన్యం. ఆ కారులో వృద్ధ దంపతులు ప్రయాణిస్తున్నారు. యుద్ద ట్యాంకర్ ఎక్కించడంతో ఆ కారు నుజ్జునుజ్జు అయిపోయింది. ఆ కారులో ఇరుక్కపోయిన ఆ వృద్ధ జంట ఆర్తనాధులు చేయడంతో .. పక్కనే ఉన్న పౌరులు, స్థానికులు వచ్చి.. వారిని కాపాడి బయటకు తీశారు.
వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఒక్కటి చాలు .. ఉక్రెయిన్ పై రష్యా ఏవిధంగా ప్రతాపం చూపిస్తో.. అర్థమవుతుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా రష్యాపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
అయితే.. రష్యా యుద్దంలో దిగేముందే చెప్పింది. ఉక్రెయిన్ ను ధ్వంసం చేయడం తమ ఉద్దేశ్యం కాదు. కేవలం అక్కడ ప్రభుత్వాన్ని కూల్చివేయడం. ఆ దేశాన్ని నిరాయుధాలు చేయడం తమ లక్ష్యమని. సామాన్య పౌరులకు ఎలాంటి హానీ చేయబోమని చెప్పింది. కానీ రష్యా ఆ మాటను తుంగలో తొక్కి.. నివాసాల మీద, ఇలా సామాన్య పౌరులు మీద దాడి చేస్తూ.. భయపూరిత వాతావారణాన్ని సృష్టిస్తోంది ఈ విషాదానికి రష్యా ఎలా సమాధానం చెప్పుతుందో.. ఏ విధంగా సమర్థించుకుంటుందో వేచి చూడాలి.
