రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (ukraine ) నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచంలోని బలమైన కూటమిలలో ఒకటైన యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్‌కు సభ్యత్వం లభించింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఉక్రెయిన్ దరఖాస్తుకు ఆమోదం లభించడం విశేషం.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (ukraine ) నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచంలోని బలమైన కూటమిలలో ఒకటైన యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్‌కు సభ్యత్వం లభించింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఉక్రెయిన్ దరఖాస్తుకు ఆమోదం లభించడం విశేషం. స్పెషల్ అడ్మిషన్ కేటగిరీలో ఉక్రెయిన్ కు సభ్యత్వం వచ్చింది. ప్రస్తుతం ఈయూలో మొత్తం 27 సభ్య దేశాలు ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ చేరికతో ఈ సంఖ్య 28కి చేరనుంది.
రష్యాతో దురాక్రమణ తర్వాత నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈయూ సభ్యత్వానికి సంబంధించి దరఖాస్తుపై జెలెన్ స్కీ సంతకం చేశారు. మరోవైపు రష్యాను ఎదుర్కొనేందుకు ఈయూ కలిసి రావాలిని.. సహాయం చేయాలని జెలెన్ స్కీ కోరుతున్నారు. ఇప్పటికే పలు యూరోపియన్ దేశాల నుంచి ఆయుధ, సైనిక సహాయం అందుతోంది.
అంతకుముందు యూరోపియన్ యూనియన్ (european union) పార్లమెంట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (volodymyr zelensky) ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈయూ దేశాలు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం విశేషం. జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యాకు లొంగిపోయే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. మా సత్తా ఏంటో నిరూపించుకుంటామని.. ఈ పోరాటంలో విజయం సాధిస్తామని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు. రష్యా సేనలతో తమ పౌరులు ధైర్యంగా పోరాడుతున్నారని.. ఈ పోరాటంలో ఎంతవరకైనా వెళ్తామని జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యా బాంబు దాడుల్లో 16 మంది చిన్నారులు చనిపోయారని.. అసలు పుతిన్ లక్ష్యమేంటీ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఈయూ దేశాలు మద్ధతిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు.. ఖార్కివ్ నగరం (kharkiv) బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. రష్యా సేనలు (russian army) మిస్సెల్స్‌తో విరుచుకుపడుతున్నాయి. జనావాసాలను సైతం టార్గెట్ చేస్తున్నారు రష్యా సైనికులు. ఉదయం నుంచి క్షిపణుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 మందికి పైగా చనిపోయినట్లు మేయర్ ప్రకటించారు. ఖర్కీవ్ దగ్గర రష్యా దాడులు.. విద్యార్ధుల తరలింపునకు అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో విద్యార్ధుల తరలింపునకు సురక్షిత మార్గం కల్పించాలని రష్యా, ఉక్రెయిన్‌లను కోరింది కేంద్ర విదేశాంగ శాఖ .
Kharkivలోని ఒక అడ్మినిస్ట్రేటివ్ భవనంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసింది. రష్యన్ క్షిపణి భవనాన్ని తాకడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం కనిపిస్తుంది. ఆ సమయంలో రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఉండటం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.
