రష్యాపై పోరులో తాము ఒంటరి అయ్యామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. నాటో లో సభ్యత్వం కోసం ఎవరు హమీ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
కీవో: Russiaపై పోరులో తాము ఒంటరయ్యామని Ukraine అధ్యక్షుడు Zelenskyy చెప్పారు. రష్యా అంటే అన్ని దేశాలు భయపడుతున్నాయని ఆయన చెప్పారు. NATOలో ఉక్రెయిన్ ను సభ్యత్వం ఇవ్వడానికి ఎవరు ముందుకు వచ్చారని జెలెన్ స్కీ ప్రకటించారు.
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత జెలెన్ స్కీ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా దాడులకు దిగుతుంది.
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను గురువారం నాడు ప్రారంభించింది. కొన్ని వారాలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిష్థితి గురువారం నాడు మిలటరీ ఆపరేషన్ కు దారి తీసింది.
నాటోలో ఉక్రెయిన్ ను చేర్చుకోవద్దని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తన డిమాండ్ ను పునరుద్ధాటించారు. మరో వైపు రష్యా తనతో పాటు తన కుటుంబాన్ని టార్గెట్ చేసిందని జెలెన్ స్కీ తెలిపారు.
శుక్రవారం నాడు తెల్లవారుజామున Kyiv లో వరుస పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవతా థృక్పథంతో 20 మిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది. UNOసెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ ఈ విషయాన్ని గురువారం నాడు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ నుండి రూ. 20 మిలియన్ డార్లను తూర్పు లుహాన్స్క్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని అవసరమైన కార్యకలాపాలకు వినియోగిస్తామని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
నగరాలు, సైనిక స్థావరాలు, వైమానిక దాడుల తర్వాత కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యా దళాలు ముందుకు వెళ్తున్నాయి. ఉక్రెయిన్ పై దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ Putin సమర్ధించుకొన్నారు.
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించడాన్ని నిరసిస్తూ పలు పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున protest కి దిగారు. దీంతో రష్యాలో సుమారు 1700 మందిని Police అదుపులోకి తీసుకొన్నారు.
ఉక్రెయిన్ లో రష్యా బలగాలు మిలటరీ ఆపరేషన్ నిర్వహించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా తప్పుబట్టారు. నాటో ఆధీనంలోని ప్రతి అంగుళం భూమిని రక్షిస్తామని Joe Bidenప్రకటించారు. నాటో ఆధీనంలోని ప్రాంతాన్ని కాపాడేందుకు USA శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తుందని బైడెన్ గురువారం నాడు హమీ ఇచ్చారు.అయితే తమ దేశానికి చెందిన సైన్యం ఉక్రెయిన్ లో రష్యాతో జరిగే మిలటరీ ఆపరేషన్ లో పాల్గొనదని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ తేల్చి చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ Putin యుద్దాన్ని ఎంచుకొన్నాడని బైడెన్ చెప్పారు. అతని చర్యలతో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ఆ దేశమే భరించాల్సి వస్తోందని బైడెన్ చెప్పారు. రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్టుగా ప్రకటించింది.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కోసం ఇండియా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్యలు ప్రారంభించారు. రష్యా విదేశాంగ మంత్రితో గురువారం నాడు జైశంకర్ మాట్లాడారు.ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తో మాట్లాడానని దౌత్యమే ఉత్తమ మార్గమమని తాను చెప్పానని Jaishankar ట్వీట్ చేశారు.
