రెండో విడత చర్చలకు ముందు తమ పట్టణాలపై బాంబు దాడులు నిలిపివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ డిమాండ్ చేశారు.
కీవ్: తమ దేశంలోని నగరాలపై Bomb దాడులను నిలిపివేయాలని Ukraine అధ్యక్షుడు Zelenskiy కోరారు. రష్యా, ఉక్రెయిన్ మొదటి విడత చర్చలు స్వల్ప పురోగతిని సాధించాయి. రెండో విడత చర్చలు సాగనున్నాయి. అయితే ఈ సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తమ దేశంలోని పట్టణాలపై Russia బాంబు దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం నాడు కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడారు. రష్యా వైమానిక దళాన్ని నిలిపివేయడానికి నో ఫ్లై జోన్ ను విధించాలని జెలెన్ స్కీ నాటో దేశాలను కోరారు. రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని వైపునకు వస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ రాజధాని Kvivనగరాన్ని వదిలి వెళ్లేందుకు జెలెన్ స్కీ మాత్రం ససేమిరా అంటున్నారు.
కనీసం తమ దేశ ప్రజలపై బాంబు దాడులను ఆపడం అవసరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. బాంబు దాడులను నిలిపివేయకుండా చర్చల్లో కూర్చోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకుు రెండు అంతర్జాతీయ మీడియా సంస్థలకు జెలెన్ స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు.గత నెల 28వ తేదీన రష్యా, ఉక్రెయిన్ మధ్య తొలి దశ చర్యలు సాగాయి. ఈ చర్చల్లో కొంత పురోగతి ఉందని సమాచారం. రెండో విడత చర్చలు ఇవాళ జరగనున్నాయి.
ఈ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనే రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని లోని హోలోకాస్ట్ స్మారక స్థలాానికి సమీపంలో ఉన్న TV టవర్ ను రష్యా క్షిపణి ఢీకొట్టిందని వార్తలు వచ్చాయి. మంగళవారం నాడు తెల్లవారుజాము నుండి ఖార్కివ్ నగరంపై రష్యా దాడులు చేస్తోంది.
ఉక్రెయిన్ పై గత నెల 24వ తేదీ తెల్లవారుజాము నుండి రష్యా మిలటరీ ఆపరేషన్ కొనసాగిస్తుంది. NATOలో సభ్యత్వంపై ఉక్రెయిన్ కు స్పష్టమైన హామీ లభించలేదు. కానీ పశ్చిమ దేశాల నుండి ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలు సరఫరా అవుతున్నాయి. తమ దేశంపై రష్యా దాడులను నిలిపివేయడానికి వీలుగా నాటో దేశాలు రష్యా పై నో ఫ్లై జోన్ ను విధించాలని కోరుతున్నాయి.
ఉక్రెయిన్ పై రష్యా దాడులను నిరసిస్తూ పలు దేశాలు రష్యాపై ఆంక్షలను విధిస్తున్నాయి. ఈయూ దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా రష్యా తీరును తప్పు బడుతున్నాయి. ఉక్రెయిన్ కు పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. రష్యా విమానాలతో పాటు బ్యాంకు లావాదేవీలపై కూడా ఆంక్షలు విధిస్తున్నాయి.
ఉక్రెయిన్‌లో మంగళవారం ఉదయం జరిగిన దాడుల్లో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను అత్యవసరంగా రైళ్లలో లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా విడిచిపెట్టాలని భారతీయులకు ఎంబసీ కోరింది. ఇదే తరుణంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేసినట్టు ప్రకటించింది. కీవ్‌లో ప్రస్తుతం భారతీయులెవరూ లేరనీ ఎంబసీని భారత దౌత్య సిబ్బందిని మరోచోటికి తరలించారని విదేశాంగశాఖ ప్రకటించింది.రష్యా ఎన్ని దాడులు చేసినా తాము పోరాడుతున్నామని యుద్ధానికి భయపడబోమని జెలెన్ స్కీ ప్రకటించారు.
