ఉక్రెయిన్ చుట్టూ రష్యా సైనిక బలగాలు మోహరిస్తుండటంతో ఎప్పుడైనా యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పార్లమెంట్ అత్యవసర పరిస్థితిని ఆమోదించింది. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ ప్రతిపాదనను పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు.
ఉక్రెయిన్ (Ukraine), రష్యా (Russia) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉక్రెయిన్ పార్లమెంట్ ఓ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 23, 2022 నుంచి రెండు తూర్పు ప్రాంతాలు మినహా మొత్తం ఉక్రెయిన్‌లో అత్యవసర పరిస్థితిని విధించింది. దీనిని పార్లమెంట్ బుధవారం ఆమోదించింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ( ukraine president Volodymyr Zelenskyy) పార్లమెంట్ లో దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టాలని బుధవారం ప్రతిపాదించారు. రష్యా నుండి పెద్ద ఎత్తున సైనిక దాడికి అవకాశ ఉండటంతో ఆ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు తిరుగుబాటు ప్రాంతాల స్వాతంత్రాన్నిగుర్తించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (russia president Vladimir Putin) సోమవారం తీసుకున్న నిర్ణయం వల్ల ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది. ఇక్కడ రష్యా అనుకూల తిరుగుబాటుదారులతో దాదాపు ఎనిమిది సంవత్సరాల వివాదం కొనసాగుతోంది. ఈ ఆందోళనలో 14,000 మందికి పైగా మరణించారు. పుతిన్ ఆ ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అనే కారణంతో రష్యా దళాలను మోహరించారు.
పార్లమెంట్‌లో రష్యా అనుకూల రాజకీయ పార్టీతో సహా దేశంలోని మాస్కో మద్దతుదారులపై ఆధారపడటం ద్వారా రష్యా ఉక్రెయిన్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నించవచ్చని ఉక్రెయిన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ లో ఉన్న తన రాయబాయ కార్యాలయ అధికారులను రష్యా ఖాళీ చేయించింది. ఈ రెండు దేశాలు తీసుకుంటున్న చర్యల వల్ల త్వరలోనే యుద్దం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య రాజీ కుదుర్చేందుకు పలువురు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి యూరోపియన్ యూనియన్ (European Union) నాయకులు గురువారం బ్రస్సెల్స్ (Brussels)లో చివరి డిచ్ సమ్మిట్ (ditch summit) ను నిర్వహించనున్నారు.
ఉక్రెయిన్ - రష్యా మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులను మన దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. మన దేశం నుంచి ఉక్రెయిన్ లో దాదాపు 20 వేల మంది స్టూడెంట్లు, మన జాతీయులు నివసిస్తున్నాయి. ఈ వివరాలను ఐక్యరాజ్య సమితి భారత శాస్వత అధ్యక్షుడు తిరుమూర్తి చెప్పారు. తమకు భారతీయుల భద్రత అతి ముఖ్యమని యూఎన్ సెక్రటరీ కౌన్సిల్ లో చెప్పారు. తమ దేశ జాతీయులు తీసుకెళ్తామని తెలిపారు. అందులో భాగంగానే ఎయిర్ ఇండియా 22వ తేదీన ఓ విమానం ఉక్రెయిన్ కు నడిపింది. ఇందులో దాదాపు 250 మంది స్టూడెంట్లు ఇండియాకు తిరిగి వచ్చారు. మరో రెండు సర్వీసులను కూడా నడపనుంది.
ఫిబ్రవరి 22, 24, 26వ తేదీల్లో ఇండియా నుంచి ఉక్రెయిన్ కు మూడు విమానాలు నడపుతామని ఎయిర్ ఇండియా గతంలోనే ప్రకటించింది. అయితే 22వ తేదీన ఒక విమానం ఢిల్లీ నుంచి ఉదయం ఏడు గంటలకు బయలుదేరి వెళ్లింది. ఉక్రెయిన్ రాజధానిలో ఉన్న కైవ్ విమానాశ్రయానికి సాయంత్రం 3 గంటలకు చేరుకుంది. అక్కడి నుంచి ఇండియన్ స్టూడెంట్లను తీసుకొని బయలుదేరి రాత్రి సమయంలో న్యూ ఢిల్లీకి చేరుకుంది.
