ఉక్రెయిన్ లో వాతావరణం టెన్షన్, టెన్షన్ గా మారిపోయింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేడు ఉక్రెయిన్ లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించడం దీనికి మరింత బలాన్ని ఇస్తోంది.

ఉక్రెయిన్ (Ukraine)లో వాత‌వార‌ణం ఉద్రిక్తంగా మారింది. ఎప్పుడు యుద్దం మొద‌లవుతుందో తెలియ‌ని పరిస్థితులు నెల‌కొన్నాయి. దీనికి ర‌ష్యా ఈరోజు తీసుకున్న మ‌రో నిర్ణ‌యం బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. ఉక్రెయిన్ లో ని కైవ్ (Kyiv) లో ఉన్న త‌న రాయ‌బార కార్యాల‌యాన్ని ర‌ష్యా బుధ‌వారం ఖాళీ చేయించింది. అయితే ఈ రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను త‌గ్గించ‌డానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలితాలను ఇవ్వలేదు. అయితే సంక్షోభాన్ని పరిష్కరించడానికి యూరోపియన్ యూనియన్ (European Union) నాయకులు గురువారం బ్రస్సెల్స్ (Brussels)లో చివరి డిచ్ సమ్మిట్ (ditch summit) ను నిర్వ‌హిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. 

ఇదిలా ఉండ‌గా.. ఉక్రెయిన్ కు ర‌క్ష‌ణ ఆయుధాల‌ను స‌మ‌కూరుస్తామ‌ని అమెరికా మంగ‌వారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు వైట్ హౌస్ (white house) నుంచి అమెరికా (america) అధ్య‌క్షుడు జో బిడెన్ (jeo biden) వివ‌రాలు వెల్ల‌డించారు. ర‌ష్యాతో పోరాటం చేయాల‌ని త‌మ దేశానికి లేద‌ని, అయితే నాటో దేశాల‌కు సంబంధించిన అంగుళం భూమిని కూడా జార‌విడుచుకోమ‌ని ఆయ‌న చెప్పారు. ర‌ష్యా (russia) తీరుపై తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం వల్ల 5 మిలియన్ల ప్రజలు స్థానభ్రంశం చెందవచ్చని యుఎస్ (us) ఈరోజు UN జనరల్ అసెంబ్లీకి తెలిపింది. సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఇటీవ‌లే మన ప్రపంచం ప్రమాదపు క్షణాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ప్రపంచం చాలా సంవత్సరాలుగా చూడని స్థాయిలో తీవ్రతను చూడగలదని హెచ్చరించారు. 

రష్యా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా ఆ దేశంపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా ఎక్కువగా లిస్ట్ చేయబడిన వారి ఆస్తులను స్తంభింపజేయడం, 27-దేశాల కూటమిలో వారి ప్రయాణంపై నిషేధం విధించ‌డం వంటివి ఉన్నాయి. US ప్రెసిడెంట్ జో బిడెన్ ఆంక్షలను ప్రకటించిన తర్వాత, వైరుధ్యాన్ని నివారించడంలో రష్యా సీరియస్‌గా వ్యవహరిస్తుందని వైట్ హౌస్ సంకేతాలు ఇచ్చింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ (Sergei Lavrov) తో గురువారం జరగాల్సిన సమావేశాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken) కూడా రద్దు చేసుకున్నారు.