ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య నెలకొన్న సంక్షోభం ముదురుతోంది. శనివారం తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల వేర్పాటువాదులు జరిపిన షెల్లింగ్‌లో ఇద్దరు సైనికులు మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉక్రేనియన్ మిలిటరీ ప్రకటించింది. 

ర‌ష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య నెల‌కొన్న ప‌రిస్థితులు ముదురుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల వేర్పాటువాదులు శనివారం జరిపిన షెల్లింగ్‌లో ఇద్దరు సైనికులు మరణించారని, నలుగురు గాయపడ్డారని ఉక్రేనియన్ మిలిటరీ (Ukrainian military)తెలిపింది. గ‌డిచిన 24 గంటల్లో 66 కాల్పుల విరమణ ఉల్లంఘనల కేసుల‌ను నమోదు చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తన ఫేస్‌బుక్ పేజీలో తెలిపింది.

ఘర్షణ జ‌రిగిన ప్రాంతాన్ని సందర్శించిన సైనిక అధికారులు, చట్టసభ సభ్యులు, విదేశీ మీడియా బృందం కాల్పుల‌కు గుర‌య్యింది. దీంతో వారిని వెంట‌నే ఆశ్రయానికి తరలించవలసి వచ్చింద‌ని వోలోడిమిర్ జెలెన్స్కీ పార్టీ ప్రతినిధి (Volodymyr Zelenskiy party) శనివారం ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) బెలారసియన్ కౌంటర్ పర్యవేక్షించే వ్యూహాత్మక అణు వ్యాయామాలలో భాగంగా రష్యా శనివారం బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో సముద్రం. భూమి ఆధారిత లక్ష్యాలను చేధించిందని క్రెమ్లిన్ తెలిపింది. వార్షిక వ్యాయామాలలో కింజాల్, సిర్కాన్ హైపర్‌సోనిక్ క్షిపణుల ప్రయోగాలు, అనేక ఇతర ఆయుధాలు ఉన్నాయని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండ‌గా.. శనివారం మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మాట్లాడుతూ.. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తే గణనీయమైన, అపూర్వమైన ఆర్థిక ఖర్చులు వస్తాయని హెచ్చరించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న డొనెట్స్క్ నగరానికి ఉత్తరాన శనివారం ఉదయం పలు పేలుళ్లు వినిపించాయి. అయితే పేలుళ్ల కు కార‌ణాలు స్ప‌ష్టంగా తెలియ‌రాలేదు.