ఉక్రెయిన్ లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను మన దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎయిర్ ఇండియా మొదటి రోజు నడిపిన విమానంలో దాదాపు 250 మంది విద్యార్థులు ఇండియాకు తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 24,26వ తేదీల్లో ఎయిర్ ఇండియా మరో రెండు విమానాలను నడపనుంది.
న్యూఢిల్లీ : రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) మధ్య తీవ్ర సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇండియా (india) లోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 250 మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి న్యూఢిల్లీ (new delhi) కి మంగళవారం సాయంత్రం తిరిగొచ్చారు.
ఉక్రెయిన్, రష్యా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఉక్రెయిన్ సరిహద్దు నుంచి భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా (air india) మంగళవారం బోయింగ్ (boeing)-787 విమానాన్ని నడిపింది. ఈ విమానంలో 250 మందికి పైగా ప్రయాణీకుల సిట్టింగ్ కెపాసిటీ ఉంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ (flight tracking website) ప్రకారం.. AI-1947 IST ఉదయం 7.30 గంటలకు న్యూఢిల్లీ (new delhi) నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు ఉక్రెయిన్‌లోని కైవ్ (Kyiv)లోని విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం ఇక్కడికి వచ్చింది. కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం మరోసారి భారతీయ విద్యార్థులను తాత్కాలికంగా భారతదేశానికి తిరిగి రావాలని సూచించింది.
ఫిబ్రవరి 22, 24, 26 తేదీల్లో ఇండియా నుంచి ఉక్రెయిన్ మధ్య మూడు విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా ఫిబ్రవరి 19వ తేదీన ప్రకటించింది. ఇదిలా ఉండగా.. విమానయాన సంస్థ విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వినోద్ కణ్ణన్ (vinod kannan)_మాట్లాడుతూ.. తమ విమనాలను ఉక్రెయిన్ కు పంపించే ప్రణాళిక ఏమీ లేదని తెలిపారు. ‘‘ విమాన పరిమితులు, ఇతర కారణాల వల్ల మేము ఉక్రెయిన్‌కు ప్రస్తుతం విమానాలను ప్లాన్ చేయడం లేదు ’’ అని ఆయన ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా తెలిపారు.
రష్యా తీసుకుంటున్న దూకుడు చర్యలను అమెరికా (america), బ్రిటన్ (Britain) సహా పలు దేశాలు విమర్శిస్తున్నాయి. రెండు రోజుల కిందట ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో భారతదేశ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి (ts tirumurthi) మాట్లాడారు. భారతీయ పౌరులను వెనక్కి తీసుకోవడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. ‘‘ మాకు మా పౌరుల భద్రత చాలా ముఖ్యం. 20,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు, జాతీయులు ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలతో సహా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. భారతీయుల శ్రేయస్సు మాకు అత్యంత ప్రాధాన్యం ’’ అని ఆయన చెప్పారు.
సోమవారం రాత్రి రష్యా (russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద నియంత్రణ ప్రాంతాలను గుర్తించారు. అప్పటి నుంచి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. దీంతో పాటు రష్యా అధ్యక్షుడు ఆదేశాలతో ఆ దేశానికి చెందిన మిలటరీ ఉక్రెయిన్ లోపలకు చొచ్చుకెళ్తున్నాయి. దీంతో ఉక్రెయిన్, నాటో (NATO) దేశాలకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Jeo biden) ఓ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ కు రక్షణ ఆయుధాలను అమెరికా సమకూరస్తుందని చెప్పారు. తమకు రష్యాతో గొడవ పడే ఉద్దేశం లేదని అయితే అదే సమయంలో నాటో భూభాగంలోని ఒక్క అంగులం కూడా కోల్పొకుండా చూసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో రష్యాపై తీవ్రంగా విరుచుపడ్డారు. ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను ప్రకటిస్తున్నట్టు చెప్పారు.
