Russia Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో రాజధాని కైవ్ చాలా రోజులుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అటువంటి పరిస్థితిలో అధ్యక్షుడు జెలెన్స్కీ దేశం విడిచిపెట్టి పారిపోయారని రష్యన్ మీడియా ప్రసరం చేస్తున్న వార్తలను ఉక్రెయిన్ తోసిపుచ్చింది.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్, రష్యా మధ్య బీకర పోరు కొనసాగుతూనే ఉంది. తొమ్మిది రోజులుగా బాంబులు, కాల్పులతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. ఉక్రెయిన్‌పై దాడి ప్రభావం రష్యాపై తీవ్రంగా పడుతోంది. ఈ క్రమంలో రష్యా మీడియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్‌ను విడిచి పోలాండ్‌కు పారిపోయారంటూ.. రష్యా మీడియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రస్తుతం రాజధాని కైవ్‌లో ఉన్నారని, ఆయన ఎక్కడికీ వెళ్లలేదని, కీవ్‌లోనే ఉన్నారని అధికారిక వర్గాలు ప్రకటించాయి..
ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై రష్యా మీడియా ఓ సంచలన వార్త కథనాన్ని వెలువరించింది. ఈ కథనం ప్రకారం.. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఉక్రెయిన్‌లో లేరని, తన కుటుంబంతో పోలాండ్ వెళ్లిపోయి.. రహస్యంగా తలదాచుకున్నారని పేర్కొంది. అయితే.. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన గానీ, ప్రతిస్పందన గానీ తెలపలేదు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో రాజధాని కైవ్ చాలా రోజులుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అటువంటి పరిస్థితిలో, జెలెన్స్కీ దేశం విడిచిపెట్టి ఉంటే, బహుశా కైవ్‌పై దాడి జరిగేదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే రష్యా నుంచి వస్తున్న తమ అధ్యక్షుడు పారిపోతున్నట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ తోసిపుచ్చింది.
ఇవే రకమైన ఆరోపణలు రష్యా మీడియా కొన్ని రోజుల క్రితం కూడా చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దేశంలో లేరని, దేశాన్ని విడిచి వెళ్లిపోయారంటూ పేర్కొంది. ఈ కథనాలపై అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఘాటుగా స్పందించారు. స్థానికంగా ఉంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. చివరి రోజు వరకూ తాను ఉక్రెయిన్‌లోనే వుంటానని, ప్రస్తుతం ఉక్రెయిన్‌లోనే ఉన్నానని ఆ వీడియోలో స్పష్టం చేశారు. తాము రష్యా సేనలను ధైర్యంగా ఎదుర్కొంటామని, వారితో పోరాడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రష్యా యొక్క నెం. 1 శత్రువని.. అతనిని లక్ష్యంగా.. చేసుకుని, అతని కుటుంబాన్ని కూడా తొలగించాలని రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఉక్రేనియన్ అణు విద్యుత్ ప్లాంట్‌ను రష్యా స్వాధీనం చేసుకుంది. శుక్రవారం (మార్చి 4) తెల్లవారుజామున దాడి చేసి జపోరిజ్జియా ప్లాంట్‌ను రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఐరోపాలో అతిపెద్ద విద్యుత్ ప్లాంట్. స్వాధీనం చేసుకునే క్రమంలో పలు మార్లు ఆ ప్లాంట్ మీద దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల అణు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అణు నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఇంతలో.. NATO సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ.. నో-ఫ్లై జోన్ లలో దాడులు చేయరాదనీ, అటువంటి చర్య వల్ల పెను ప్రమాదం వాటిల్లేట్టు ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తన దేశంపై నో-ఫ్లై జోన్‌ను అమలు చేయాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బలగాలు ఉక్రెయిన్‌లో తమ దాడులను వేగవంతం చేశాయి, నగరాలపై వందలాది క్షిపణులు, ఫిరంగి దాడులను చేస్తున్నాయి.
