Russia Ukraine Crisis: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్ సైనిక‌బ‌ల‌గాలు లొంగిపోతే చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మ‌రింత‌గా దిగ‌జారుతుండ‌టంతో ఉక్రెయిన్.. కాల్పుల విర‌మ‌ణ‌, శాంతి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది.  

Russia Ukraine Crisis: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాల‌ని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. అయితే, ఇప్ప‌టికే రష్యా ఉక్రెయిన్ లోని పెద్ద సంఖ్యలో సైనిక స్థావ‌రాల‌ను ధ్వంసం చేయ‌డంతో పాటు సైనిక‌ బ‌ల‌గాలు కీవ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించాయి. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్ సైనిక‌బ‌ల‌గాలు లొంగిపోతే చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ర‌ష్యా దాడికి కొన‌సాగిస్తూనే ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌టంతో ఉక్రెయిన్ బ‌ల‌గాలు దాడుల‌ను ప్ర‌తిఘ‌టిస్తూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మ‌రింత‌గా దిగ‌జారుతుండ‌టంతో ఉక్రెయిన్.. కాల్పుల విర‌మ‌ణ‌, శాంతి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. 

ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రాన్ని ర‌ష్యా బ‌ల‌గాలు స్వాధీనం దిశ‌గా ముందుకు సాగుతున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డి ప్ర‌వేశించాయి. ఈ నేప‌థ్యంలోనే దేశ భ‌ద్ర‌త‌, అక్క‌డి ప్ర‌జ‌ల ర‌క్షించుకునే చ‌ర్య‌ల్లో భాగంగా ఉక్రెయిన్.. ర‌చ్చ‌ల‌కు సిద్ధ‌మ‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ఇరు దేశాల చ‌ర్చ‌ల స‌మ‌యం, స్థలంపై రాబోయే కొద్ది గంటల్లో సంప్రదింపులు జరుపుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రతినిధి సెర్గీ నైకిఫోరోవ్ సోషల్ మీడియాలో తెలిపారు. ర‌ష్యా దాడి ప్రారంభమైనప్పటి నుండి దౌత్యం కోసం ఆశను అందిస్తోంది. ఉక్రెయిన్ తనను తాను తటస్థ దేశంగా ప్రకటించుకోవడంపై చర్చించడానికి సుముఖత వ్యక్తం చేసిన తర్వాత బెలారసియన్ రాజధాని మిన్స్క్‌లో సమావేశం కావాలని ముందుగా క్రెమ్లిన్ తెలిపింది. అయితే ఉక్రెయిన్ వార్సాను వేదికగా ప్రతిపాదించింది. 

"ఉక్రెయిన్ కాల్పుల విరమణ మరియు శాంతి గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికీ అందుకు సుముఖంగా ఉంది" అని Nykyforov సోష‌ల్ మీడియా వేదిక‌గా పేర్కొన్నారు. కాగా, US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ.. ప్ర‌తిపాదిత చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉంటే ర‌ష్యా.. ఉక్రెయిన్ పై త‌న దాడిని ఆపాల‌ని పేర్కొన్నారు. ఇదిలావుండ‌గా, పౌరులు ఏ ర‌ష్యాను ఎదుర్కొవ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని ఉక్రెయిన్ సూచించింది. ర‌ష్యా-ఉక్రెయిన్ ల యుద్ధం కార‌ణంగా పెద్ద సంఖ్య‌లో ప్రాణ‌న‌ష్టం, ఆర్థిక న‌ష్టం సంభ‌వించింద‌ని ఇప్ప‌టికే అనేక నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ర‌ష్యా త‌న దాడిని ఆపాల‌ని ప్ర‌పంచ దేశాలు, నాటో కూటమి పేర్కొంటోంది. ర‌ష్యాను హెచ్చ‌రిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అమెరికాతో పాలు ప‌లు దేశాలు ర‌ష్యాపై అనేక ఆంక్ష‌లు విధించాయి. మ‌రిన్ని ఆంక్ష‌ల‌కు విధించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. 

ఈ నేప‌థ్యంలోనే ర‌ష్యా తీరును ఖండిస్తూ.. ఐరాస అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హిస్తోంది. ఐక్య రాజ్య స‌మితిలోని భ‌ద్ర‌తా మండ‌లిలో అమెరికా, అల్బేనియా దేశాలు క‌లిసి ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్దానికి వ్య‌తిరేకంగా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ తీర్మాణాన్ని భ‌ద్ర‌తా మండ‌లిలో స‌భ్యులుగా ఉన్న 15 దేశాల్లో 11 దేశాలు ఆమోదించాయి. అయితే భార‌త్, చైనా, యూఏఈలు ఈ ఓటింగ్ దూరంగా ఉన్నాయి. అయితే యూఎస్‌లో ఐదు శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన రష్యా తన విటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది. ద్రతా మండలిలో రష్యా విటోను ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకున్నప్పటికీ, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటిరి చేశామని పశ్చిమదేశాలు భావిస్తున్నాయి. ఇక, 193 సభ్యదేశాలు ఉన్న యూఎన్ జనరల్‌ అసెంబ్లీలో ఈ ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.