Russia Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచ దేశాలు ఎంత చెప్పిన విన‌కుండా ర‌ష్యా  ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి దిగింది. ఈ త‌రుణంలో ఉక్రెయిన్ కు రాజకీయ, వైద్య ప‌రంగా ఆదుకోవాలని ఉక్రెయిన్ ఎంపీ సోఫియా ఫెడీనా భారత దేశాన్ని కోరారు. 

Russia Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ దేశాలు ఎంత చెప్పిన విన‌కుండా ర‌ష్యా ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి దిగింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ చిరుటాకులాగా వ‌ణుకుతోంది. ఇప్ప‌టికే భారీ మొత్తంలో ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. ప్ర‌ధానంగా ఉక్రెయిన్ క్యాపిటల్ సీటీ కీవ్‌ లోని రక్షణశాఖ, సైనిక కార్యాలయాపై రష్యా బలాగాలు బాంబుల వ‌ర్షం కురిపించాయి. రష్యా దాడుల్లో బలగాలు, సాధారణ ప్రజలు సహా ఇప్పటికే 137 మంది మంది చనిపోయారని, మరో 316 మంది గాయపడ్డారని చెప్పారు. అయితే విధి లేని ప‌రిస్థితిలో ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగింది. 

ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ .. భావోద్వేగానికి గురయ్యారు. యుద్ధంలో ఒంటరైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ఎలాంటి సాయాన్ని ఆశించవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, తాము మాత్రం రష్యాను చూసి భయపడట్లేదని, పోరాడుతామని, దేశాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రష్యా దాడికి బెదిరేది లేదంటున్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాడిమిర్‌ జెలొంస్కీ. రష్యా దాడులను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ప్రపంచదేశాలు తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్ర‌మంలో 10 రష్యా యుద్దవిమానాలను , హెలికాప్టర్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది. అయితే తాము ఒక్క యుద్ద విమానాన్ని కూడా కోల్పోలేదని ఉక్రెయిన్ అస‌త్య ప్ర‌చారం చేస్తుందని ర‌ష్యా పేర్కొంది.


ఈ సమయంలో ఉక్రెయిన్ కు రాజకీయ, వైద్య పరంగా ఆదుకోవాలని ఉక్రెయిన్ ఎంపీ సోఫియా ఫెడీనా భారత దేశాన్ని కోరారు. ఉక్రెయిన్‌లోని ఓ బాంబు షెల్టర్‌లో ఉన్న సోఫియా ఫెడీనా ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సార్వభౌమాధికార దేశం యొక్క మానవ హక్కులను కాపాడాలని నేను భారతీయ రాజకీయ నాయకులందరినీ వేడుకుంటున్నాను. ఉక్రెయిన్‌కు ఆయుధ మద్దతు మాత్రమే కాదు, మానసిక సహాయం కూడా అవసరం. దురాక్రమణదారు రష్యాను శిక్షించవలసి ఉంది. శాంతియుతంగా జీవిస్తున్న ఉక్రెయినియన్లను రష్యన్లు చంపుతుంది. ఓ సార్వభౌమాధికార దేశ మానవ హక్కులను కాపాడాలని భారత దేశంలోని రాజకీయ నాయకులందర్నీ కోరుతున్నాన‌ని తెలిపారు. 

దక్షిణ ఉక్రెయిన్‌లోని నౌకాశ్రయ నగరం ఓడెస్సా రష్యా బలగాలకు పడిపోయిందనే వార్తలను కూడా ఆమె తోసిపుచ్చారు. ఇవన్నీ రష్యన్లు సృష్టిస్తున్న వదంతులేనని చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర రెండవ రోజుకి ప్రవేశించడంతో.. భారతదేశం నుండి రాజకీయ, ఔషధ సహాయం కోరుతుంద‌ని తెలిపారు. సుమీ నగరంలోకి రష్యన్ దళాలు ప్రవేశించయ‌ని తెలిపారు. ప్రాంతీయ గవర్నర్, డిమిట్రో జివిట్‌స్కీ మాట్లాడుతూ, ఉక్రేనియన్ దళాలు రష్యన్ దళాలతో పోరాడాయి, అయితే ఇతర రష్యన్ కాన్వాయ్‌లు పశ్చిమాన ఉక్రేనియన్ రాజధాని వైపు తిరుగుతూనే ఉన్నాయని తెలిపారు.