అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉక్రెయిన్‌కు చెందిన ఓ కంపెనీ ఐదు మిలియన్ డాలర్ల లంచం అందించినట్టు ఫాక్స్ న్యూస్ ఓ కథనం ప్రచురించింది. ఆ ఉక్రెయిన్ కంపెనీలో జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ బోర్డు సభ్యుడిగా ఉన్నాడు. ఎఫ్‌బీఐకి చెందిన డాక్యుమెంట్ల ఆధారంగా ఈ కథనం ప్రచురితమైంది. 

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఫాక్స్ న్యూస్ ఈ ఆరోపణలతో ఓ కథనం ప్రచురించింది. ఉక్రెయిన్‌కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ నుంచి అమెరికా అధ్యక్షుడ జో బైడెన్‌కు ఐదు మిలియన్ డాలర్ల డబ్బు లంచం రూపంలో అందిందని ఆ కథనం పేర్కొంది. ఆ ఉక్రెయిన్ కంపెనీ బురిస్మా హోల్డింగ్‌లో జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ బోర్డ్ సభ్యుడిగా ఉన్నాడు.

ఆ గ్యాస్ కంపెనీ బురిస్మా హోల్డింగ్‌కు చెందిన ఓ అధికారి నుంచి ఈ డబ్బు జో బైడెన్‌కు అందిందని ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం ఆ అధికారి పై ఉక్రెయినియన్ దర్యాప్తు సంస్థ అవినీతి ఆరోపణల కింద విచారణ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ అధికారి అవినీతి ఆరోపణలతో తమ సంస్థ పెట్టుబడులు పెట్టలేకపోతున్నదని, కాబట్టి, తమకు జో బైడెన్ ఆయన కొడుకు హంటర్ బైడెన్ సహకరించాలని కోరాడు.

ఈ కథనం ఎఫ్‌బీఐ ఎఫ్‌డీ 1023 ఫామ్‌ ఆధారంగా ప్రచురించింది. రహస్యంగా మానవ వనరుల నుంచి అందిన వెరిఫై చేయని సమాచారాన్ని సాధారణంగా ఎఫ్‌‌బీఐ ఇందులో పొందుపరుస్తుంటుంది. ఈ ఫామ్ ప్రకారం, 2020 జూన్‌లో ఓ వ్యక్తి ఎఫ్‌‌బీఐకి పైన పేర్కొన్న లంచం గురించి తెలిపారు. ఆ వ్యక్తి అత్యంత విశ్వసనీయుడని ఎఫ్‌బీఐ పేర్కొనడం గమనార్హం.

Also Read: హనుమంతుడు ఒక ఆదివాసి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్య, దేవుడికిది అవమానమంటూ బీజేపీ నేత ఫైర్

2015 నుంచి బురిస్మా అధికారితో చాలా సార్లు భేటీ అయ్యారని, ఆ చర్చల సందర్భంగానే అమెరికాలో ఆయిల్ హక్కులు పొందడం, అమెరికా ఆయిల్ కంపెనీతో సంబంధాలు పెట్టుకోవడం గురించి సలహా అడిగాడని ఆ రహస్య వ్యక్తి తెలిపారు. బోర్డులో హంటర్ బైడెన్ పాత్ర గురించి ఆ అధికారి చర్చించాడని, ఆయన డంబ్ అని పేర్కొన్నారని వివరించారు. 50000 డాలర్ల చొప్పున ఇద్దరు బైడెన్‌లకు అందించాలని తాను ఆ అధికారికి చెప్పానని పేర్కొన్నారు. కానీ, ఆయన ఐదు మిలియన్ డాలర్ల చొప్పున అందించానని చెప్పినట్టూ ఆ వ్యక్తి వెల్లడించారు. ఆ ఎఫ్‌బీఐ డాక్యుమెంట్‌లో ది బిగ్ గయ్ అని పేర్కొందని, ఆ ది బిగ్ గయ్ బహుశా జో బైడెన్ అయి ఉంటాడని కథనం వివరించింది.