Russia Ukraine Crisis : ఉక్రెయిన్‌లో ర‌ష్య‌న్ బ‌ల‌గాలు ఉక్రెయిన్‌ మహిళలపై అత్యాచారాల‌కు తెగ‌బ‌డుతున్నారనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ దేశపు విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా సంచ‌ల‌న ఆరోపణ‌లు చేశారు. రోజురోజుకు ఈ అకృత్యాలు మ‌రింతగా తీవ్రతరం కావొచ్చన‌ని,  అమెరికా. కొన్ని నగరాల్లో మినహా ర‌ష్యాకు ఉక్రెయిన్‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ పూర్తి ప‌ట్టు చిక్క‌ని నేప‌థ్యంలో ర‌ష్య‌న్ బ‌ల‌గాలు అస‌హ‌నంతో ఇలాంటి మ‌రిన్ని దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే అవకాశాలు ఉన్నాయని అమెరికా వైపు నుంచి పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి 

Russia Ukraine Crisis : రష్యా- ఉక్రెయిన్ మధ్య వార్ పదో రోజుకు చేరుకుంది. రోజు రోజుకు యుద్ధ తీవ్రత పెరుగుతోంది. ఇప్ప‌టికే ఉక్రెయిన్ లోని పలు న‌గరాల‌ను ఆక్ర‌మించిన ర‌ష్యా.. శ‌నివారం కూడా ఉక్రెయిన్ లోని పలు న‌గ‌రాల‌పై బాంబుల వర్షం కురిపించింది. రాజధాని కీవ్ సిటీతో సహా చెర్నిహివ్, ఖార్కివ్, ఖేర్సన్, మైకోలైవ్ నగరాలపై దాడుల‌ను కొన‌సాగించింది. ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కీవ్ తో పాటు ఖార్కీవ్ నగరంపై రాకెట్లతో దాడులు చేస్తోంది. యుద్ధం మొదట్లో కేవలం మిలటరీ పోస్ట్ లపైనే దాడులు చేస్తున్నామని చెప్పుకున్నప్పటికీ… ప్రస్తుతం జనావాసాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్ లపై కూడా దాడులు చేస్తోంది. 

ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లో ర‌ష్య‌న్ బ‌ల‌గాలు ఉక్రెయిన్‌ మహిళలపై అత్యాచారాల‌కు తెగ‌బ‌డుతున్నారనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ దేశపు విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా సంచ‌ల‌న ఆరోపణ‌లు చేశారు. రోజురోజుకు ఈ అకృత్యాలు మ‌రింతగా తీవ్రతరం కావొచ్చన‌ని, అమెరికా. కొన్ని నగరాల్లో మినహా ర‌ష్యాకు ఉక్రెయిన్‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ పూర్తి ప‌ట్టు చిక్క‌ని నేప‌థ్యంలో ర‌ష్య‌న్ బ‌ల‌గాలు అస‌హ‌నంతో ఇలాంటి మ‌రిన్ని దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే అవకాశాలు ఉన్నాయని అమెరికా వైపు నుంచి పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

ర‌ష్యా సైనికుల దారుణాల‌ను అడ్డుకోవాలని ..వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ఇందుకోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో అనేక ఫిర్యాదులు త‌న దృష్టికి వ‌చ్చినట్టు తెలిపారు. ఉక్రెయిన్‌లో పౌర ప్రాణనష్టం పెరుగుతుండగా, ఇలాంటి దారుణాల అడ్డుక‌ట్ట వేయాల‌ని కోరారు. 

ఉక్రెయిన్‌లో ఆరోపించిన యుద్ధ నేరాలను విచారించాలా? వద్దా? అని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అధ్యయనం చేస్తున్నందున, బ్రౌన్, మాజీ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులతో సహా ప్రముఖులు బుధవారం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు చూస్తున్న భయంకరమైన సంఘటనలను ముగింపుకు తీసుకురావడంలో తాము ఏవిధంగా.. ఎటువంటి రాయిని వదిలిపెట్టం, తద్వారా అటువంటి భయాందోళనలను గురైనా వారు క్రిమినల్ చట్టం క్రింద వ్యక్తిగత జవాబుదారీకి లోబడి ఉంటారనీ, తద్వారా న్యాయం చేయవచ్చని అభిప్రాయం ప‌డ్డారు.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ గగనతలాన్ని ‘నో-ఫ్లై జోన్‌’గా ప్రకటించాలని ఆ దేశ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ.. నాటో కు విజ్ఙ‌ప్తి చేశారు. కానీ.. ఆయ‌న విజ్ఞ‌ప్తిని సున్నితంగా తోసిపుచ్చింది. ఈ నేప‌థ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌లాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్ర‌క‌టిస్తే.. ప‌రోక్షంగా యుద్దం చేయాల‌నే కోరిక ఉన్న‌ట్లేన‌ని పేర్కోన్నారు. ఏ దేశమైనా నో ఫ్లై జోన్‌గా విధించినా.. అలా విధించాలని కోరినా యుద్ధానికి దిగినట్టేనని హెచ్చరించారు.

 ‘నో ఫ్లై జోన్‌’పై ముందుకు వెళ్తే.. నాటో దేశాలతో పాటు యావత్తు ప్రపంచం భారీ, విపత్తు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చ‌రించారు. రష్యాలో ఆందోళనల కట్టడికి మార్షల్‌ లా విధించే ఆలోచన లేదని, నోఫ్లై జోన్ ఆంక్ష‌లు విధిస్తే.. తమపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్టుగానే పరిగణిస్తామని తెలిపారు. అన్నీ ఆలోచించిన తర్వాతనే ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగామని పేర్కొన్నారు.