ఉత్తర ఐర్లాండ్‌లోని ఒక సరస్సులో  ఈత కొట్ట‌డానికి వెళ్లి కేరళకు చెందిన ఇద్దరు యువకులు నీట‌మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితుల‌తో క‌లిసి వారు అక్క‌డికి వెళ్లార‌ని పోలీసులు తెలిపారు.  

లండన్: ఉత్తర ఐర్లాండ్‌లోని సరస్సు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు కేర‌ళ‌కు చెందిన యువ‌కులు నీటి మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైన సంఘటన సోమవారం నాడు చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. యూకే లో సెలవుదినం అయిన సోమవారం డెర్రీ (లండ‌న్) లోని ఎనాగ్ లాఫ్‌కు వెళ్లిన స్నేహితుల బృందంలో కేరళకు చెందిన జోసెఫ్ సెబాస్టియన్, రూవెన్ సైమన్ లు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్తర ఐర్లాండ్‌లోని సరస్సు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లగా.. ఈ ఇద్దరు కేర‌ళ యువ‌కులు నీట‌మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా విషాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న అని అక్క‌డి పోలీసులు పేర్కొన్నారు. ఉత్తర ఐరిష్ నగరంలోని కేరళ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం యువకులకు నివాళులు అర్పించారు.

"మిస్టర్ రూవెన్ సైమన్, మిస్టర్ జోసెఫ్ సెబాస్టియన్ అనే ఇద్దరు యువకులు నిన్న ఎనాగ్ లాఫ్‌లో జరిగిన విధ్వంసకర విషాదంతో మేము చాలా హృదయ విదారకంగా ఉన్నాము. ఈ కష్ట సమయంలో వారి కుటుంబాల‌కు మేము అండ‌గా కలిసి ఉన్నాము" అని ఓ ప్రతినిధి చెప్పారు. ఉత్తర ఐర్లాండ్‌లోని పోలీస్ సర్వీస్ (PSNI) ఈ సంఘటనకు సంబంధించిన ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇద్ద‌రు యువ‌కులు నీట మునిగి మ‌ర‌ణించిన‌ట్టు తెలిపింది. వారి మృతదేహాలను సరస్సు నుండి స్వాధీనం చేసుకున్నట్లు ధృవీకరించింది. ఇద్ద‌రిని నీటి నుంచి బ‌య‌ట‌కు తీశారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు వైద్యులు పేర్కొన్నార‌ని ఇన్స్పెక్టర్ బ్రోగన్ చెప్పారు. ఈ సంఘటనపై విచారణలు కొనసాగుతున్నాయ‌ని అన్నారు. 

Scroll to load tweet…

ఈ ఘ‌ట‌న‌లో మ‌రో యువ‌కుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. చిన్న చిన్న గాయాలు కాగా, అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌రో ముగ్గురు యువ‌కులు సైతం సంఘటనా స్థలంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. డెర్రీ మేయర్, స్ట్రాబేన్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్, సాండ్రా డఫీ.. ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని సరస్సులు, నదులలో ఈత కొడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక త‌ల్లిగా బాధిత కుటుంబం అనుభ‌విస్తున్న బాధ‌ను అర్థం చేసుకోగ‌ల‌న‌నీ పేర్కొన్న ఆమె.. వారికి అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. 

Scroll to load tweet…