విద్యాబుద్ధులు  నేర్పించి విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కొందరు ఉపాధ్యాయులు ఆ వృత్తికే కళంకం తీసుకొస్తున్నారు. తమ దగ్గర చదువుకుంటున్న విద్యార్ధులపై కన్నేసి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

సమాజంలో ఇటువంటి విపరీత పోకడలు ఎక్కువయ్యాయి. తాజాగా ఇదే తరహా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉపాధ్యాయురాలి కేసు యూకే కోర్టు ముందుకు వచ్చింది. 

15 ఏళ్ల విద్యార్థితో వివాహితురాలైన ఉపాధ్యాయురాలి శారీరక సంబంధం కేసుపై ఏమెర్‌షమ్‌ లా కోర్టు శుక్రవారం విచారణ జరిపింది.  అయితే తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని 35 ఏళ్ల బకింగ్‌హామ్‌షిర్‌ ఉపాద్యాయురాలు కాండిస్‌ బార్బర్‌ కోర్టుకు తెలిపింది.

తన బిజీ లైఫ్ స్టైల్‌ కారణంగా విద్యార్ధితో ఆరు బయట శృంగారంలో పాల్గొనే అవకాశం ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేసింది. కాండిస్ మాట్లాడుతూ.. సంఘటన జరిగిందని ఆరోపిస్తున్న రోజు ( 2018, అక్టోబర్‌ 10)న తాను ఫోస్టర్‌ కేర్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో పాల్గొన్నానని ఆమె చెప్పారు.

ఆ సమావేశం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమై.. 6:30 ముగిసిందని కాండిస్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఆ తర్వాత రోజు కూడా తాను వూళ్లో లేనని ఆమె వెల్లడించారు. స్నేహితురాలితో కలిసి లండన్‌లో జరుగుతున్న ఓ కంసర్ట్‌కు వెళ్లానని తెలిపింది.

బార్బర్‌ వాదనలు విన్న న్యాయస్ధానం విచారణను వాయిదా వేసింది. కాగా, సదరు 15 ఏళ్ల విద్యార్థికి కాండిస్‌ బార్బర్‌ తన అర్థనగ్న ఫొటోలు, ఇతర అసభ్యకర వీడియోలు సైతం పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.