వెస్ట్ మినిస్టర్  మేజిస్ట్రేట్ కోర్టు నీరవ్ మోడీకి  బెయిల్‌ను నిరాకరించింది. శుక్రవారం నాడు కోర్టులో నీరవ్ మోడీని హాజరుపర్చారు. 

లండన్: వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు నీరవ్ మోడీకి బెయిల్‌ను నిరాకరించింది. శుక్రవారం నాడు కోర్టులో నీరవ్ మోడీని హాజరుపర్చారు.

తనకు బెయిల్ ఇవ్వాలని నీరవ్ మోడీ కోర్టును అభ్యర్ధించారు. కానీ కోర్టు మాత్రం బెయిల్ ఇవ్వనని తేల్చి చెప్పింది.వజ్రాలవ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో పెద్ద ఎత్తున కుంభకోణానికి కారణమయ్యాడనే కేసులో అరెస్టయ్యాడు. 

బ్యాంకు కుంభకోణం బయటపడకముందే నీరవ్ మోడీ ఇండియా నుండి పారిపోయాడు. లండన్‌లో తలదాచుకొంటున్న మోడీని నెల రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు.