గతేదాడి మొదలైన కరోనా విజృంభన ఇంకా తగ్గడంలేదు. ప్రపంచదేశాలన్నీ దీని తాకిడికి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. దేశ, విదేశాల్లో అనేక కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో తలమునకలయ్యాయి. అయితే కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసిన పైజర్ కంపెనీ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

అమెరికాకు చెందిన ఫైజర్ అండ్ బియోఎంటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ వైపే ప్రపంచమంతా చూస్తోంది. అయితే మొదటి సారిగా వయాగ్రా తయారు చేసింది కూడా ఈ కంపెనీనే. అప్పట్లో ఫైజర్ కంపెనీ తొలిసారిగా వయాగ్రా ట్యాబ్లెట్లను హైబీపీ, హార్ట్ సమస్యలకు ట్రీట్‌మెంట్‌గా తయారుచేసింది. 

ఈ వయాగ్రా టాబ్లెట్లను ముందుగా జంతువుల మీద ప్రయోగించి, మంచి ఫలితాలు సాధించింది. ఆ తర్వాతే వీటిని మనుషుల మీద ప్రయోగించింది. ఇవీ సక్సెస్ అయ్యాకే శృంగార సమస్యలకు చెక్ పెట్టేలా వయాగ్రా ట్యాబ్లెట్లను తయారుచేశారు. 

ఎక్కువ సేపు శృంగారంం చేయాలనుకునేవారికి వయాగ్రా ఓ అద్భుత మాత్రగా అందుబాటులోకి వచ్చింది. డాక్టర్లు కూడా శృంగార సమస్యలకు దీన్ని సూచిస్తున్నారు. అది ఫైజర్ కంపెనీ సాధించిన విజయం. 

ఇప్పుడుకరోనా వైరస్ విషయంలోనూ ‘ఫైజర్’ కంపెనీ అద్భుత ఫలితాలు సాధిస్తుందట.. వచ్చే వారమే బ్రిటన్‌లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించబోతోందట. ఇప్పుడు ప్రపంచానికి పవర్‌ఫుల్ కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతున్న కంపెనీ కూడా ఇదేనని అభిప్రాయపడుతున్నారు కొందరు పరిశోధకులు.