యూఏఈలో ఒక్కరోజులో 490 కరోనా కేసులు..
కరోనాతో పోరాడి మొత్తంగా 1443 మంది పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చనిపోయిన వారంతా ఆసియాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. యూఏఈలోనూ దీని ప్రభావం పెరిగిపోతోంది. కరోనా విజృంభిస్తోంది. యూఏఈలో మంగళవారం ఒక్కరోజే 490 కరోనా కేసులు నమోదయ్యాయి.
కాగా..ముగ్గురు చనిపోయినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోపక్క 83 మంది పూర్తిగా కోలుకున్నట్టు వెల్లడించింది. యూఏఈలో ఇప్పటివరకు 7,755 మంది కరోనా బారిన పడగా.. 46 మంది మృతిచెందారు.
కరోనాతో పోరాడి మొత్తంగా 1443 మంది పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చనిపోయిన వారంతా ఆసియాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరందరూ అంతకుముందే అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. చనిపోయిన వారికి ఆరోగ్యశాఖ తమ ప్రగాఢ సానుభూతి తెలిపింది.
కాగా.. కరోనాను నియంత్రించేందుకు యూఏఈ ప్రభుత్వం నిత్యం వేల మందికి కరోనా పరీక్షలను నిర్వహిస్తోంది. మరోపక్క స్టెరిలైజేషన్ ప్రాగ్రాంలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరాలకు తప్పించి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తూ వస్తోంది.