Asianet News TeluguAsianet News Telugu

పదేళ్ల తెలుగు బాలికను సన్మానించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పదేళ్ల తెలుగు బాలిక అన్నపరెడ్డి శ్రావ్యను సత్కరించారు. గర్స్ స్కౌట్ మెంబర్ గా ఉన్న శ్రావ్య  అమెరికాలో కరోనా రోగులకు సేవలు చేస్తున్న వైద్య సిబ్బందిని అభినందిస్తూ వారికి వ్యక్తిగతంగా కార్డులను పంపారు. 

U.S. President Trump honours Telugu girl for gesture towards COVID-19 heroes
Author
New Delhi, First Published May 18, 2020, 12:00 PM IST

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పదేళ్ల తెలుగు బాలిక అన్నపరెడ్డి శ్రావ్యను సత్కరించారు. గర్స్ స్కౌట్ మెంబర్ గా ఉన్న శ్రావ్య  అమెరికాలో కరోనా రోగులకు సేవలు చేస్తున్న వైద్య సిబ్బందిని అభినందిస్తూ వారికి వ్యక్తిగతంగా కార్డులను పంపారు. 

వైద్య సిబ్బందిలో ఉత్సాహం నింపేలా వారిని సేవలను ప్రశంసిస్తూ శ్రావ్య పలువురికి కార్డులను పంపారు.ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి వచ్చింది. శనివారం నాడు అమెరికాలో జరిగిన కార్యక్రమంలో శ్రావ్యను ట్రంప్ అభినందించారు. ఆమెతో పాటు లైలాఖాన్, లారెన్ మాట్నీ అనే మరో ఇద్దరు బాలికలను కూడ ట్రంప్ సత్కరించారు.

also read:పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోప్‌కి కరోనా: ఆసుపత్రిలో చేరిక

మేరీల్యాండ్ ఎల్క్‌రిడ్జ్ లోని ట్రూప్ 744కు చెందిన ఈ ముగ్గుురు బాలికలు 100 బాక్సుల గర్ల్స్ స్కౌట్స్ కుకీస్ ను స్థానిక అగ్నిమాపక వైద్యసిబ్బందికి విరాళంగా ఇచ్చారు. శ్రావ్య విషయానికి వస్తే హనోవర్‌లో నివాసం ఉంటున్న ఆమె ప్రస్తుతం నాలుగో గ్రేడ్ చదువుతుంది.

శ్రావ్య తండ్రి విజయ్ రెడ్డి పార్మాసిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం గుంటూరు పట్టణం. శ్రావ్య తల్లి సీత కల్లంది గుంటూరు జిల్లాలోని బాపట్ల సమీపంలోని నరసయ్యపాలెం. ట్రంప్ చేతుల మీదుగా శ్రావ్యకు సన్మానం జరగడంపై కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios