ఆడుకోవడానికి పక్కింటి వాళ్ల వస్తువులో, బొమ్మలో పిల్లలు ఎత్తుకెళుతుంటారు. అలాంటిది ఏకంగా విమానాన్నే ఎత్తుకెళ్లడం గురించి విన్నామా.. ఐతే అమెరికాలో ఈ వింత సంఘటన జరిగింది. యూటా నగరానికి చెందిన ఇద్దరు బాలలు థ్యాంక్స్ గీవింగ్ డే సందర్భంగా ప్రైవేట్ ఎయిర్‌స్ట్రిప్‌లో ట్రాక్టర్ నడిపేందుకు అవకాశం పొందారు.

ట్రాక్టర్ నడుపుతూ వెళుతున్న వారికి అక్కడ పార్క్ చేసి ఉన్న సింగిల్ ఇంజిన్ ఫిక్సిడ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను చూసి దానిని ఎత్తుకెళ్లారు. బుల్లి ఎయిర్‌క్రాఫ్ట్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. చివరికి ఆ బాలలు విమానాన్ని వెర్నల్ ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ చేశారు.

అక్కడ వీరిద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు జువైనల్ హోమ్‌కు తరలించారు. ఆ ఇద్దరిలో ఒకరికి 14 ఏళ్లు, మరొకరికి 15 ఏళ్ల వయసు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.