గగనతలంలో రెండు విమానాలు ఢీకొన్న ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువరు చనిపోయారు. అయితే ఇంత మంది మరణించారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. 

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గురువారం రెండు చిన్న విమానాలు గ‌గ‌న‌త‌లంలో ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో పలువురు మృతి చెందార‌ని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలోని స్థానికంగా ఉన్న రెండు విమానాలు ఒకే సారి ల్యాండ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నించిన సంద‌ర్భంలో ఇది చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న వాట్సన్‌విల్లే నగరంలో జ‌రిగింది. 

ముగ్గురు పిల్లల్ని, భర్తను వదిలేసి ప్రియుడితో భార్య జంప్.. వీడియో కాల్స్ చేసి హింస.. తట్టుకోలేక ఆ భర్త చేసిన ప

‘‘ వాట్సన్‌విల్లే మునిసిపల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన 2 విమానాలు ఢీకొన్న తర్వాత పలు ఏజెన్సీలు స్పందించాయి. మాకు అనేక మరణాల నివేదికలు అందాయి ’’అని సిటీ అధికారులు ట్విట్టర్ ద్వారా ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మిగితా వివ‌రాలు త్వ‌ర‌లోనే అంద‌జేస్తామ‌ని ఆ ప్ర‌క‌ట‌న పేర్కొంది.

దేశంపై విషం చిమ్మే YouTube channels పై వేటు.. నిషేధించ‌బ‌డిన channels ఇవే..!

ఇదే అమెరికాలోని నార్త్ లాస్ వెగాస్ విమానాశ్రయంలో ఇలాంటి ఘ‌ట‌న‌లే చోటు చేసుకున్నాయి. గ‌త నెల 18వ తేదీన చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెందారు. విమానాలు ల్యాండ్ అవుతున్న స‌మ‌యంలో ఇది చోటు చేసుకుంది. సింగిల్ ఇంజ‌న్ పైపర్ PA-46, సింగిల్ ఇంజిన్ సెస్నా-172 ఈ ప్ర‌మాదానికి గుర‌య్యాయి. 

Scroll to load tweet…

‘‘ సెస్నా 172తో ఢీకొన్నప్పుడు పైపర్ PA-46 ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తోంది. ఈ స‌మ‌యంలోనే ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్రాథ‌మిక స‌మాచారం తెలుపుతోంది ’’ అని FAA ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘పైపర్... రన్‌వే -30 కుడివైపు తూర్పున ఉన్న మైదానంలోకి దూసుకెళ్లింది. సెస్నా నీటిని నిలుపుకునే చెరువులో పడిపోయింది.’’ అని పేర్కొంది. 

షాకింగ్.. మెదడు తినే అమీబా.. ఇన్ఫెక్షన్‌తో బాలుడు మృతి.. పూర్తి వివరాలు ఇవే

ఇలాంటి ఘ‌ట‌నే ఏప్రిల్ 1వ తేదీన దక్షిణ కొరియాకు చెందిన జ‌రిగింది. రెండు వైమానిక దళ విమానాలు గగనతలంలో ఢీకొట్టుకోవ‌డంతో ముగ్గురు మృతి చెందారు. మ‌రొక‌రికి గాయాలు అయ్యాయి. శిక్షణ సమయంలో ఈ విమాన ప్ర‌మాదం జ‌రిగింద‌ని అధికారులు తెలిపారు. రెండు KT-1 ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒక‌దానిని ఒక‌టి ఢీకొట్టుకున్నాయ‌ని, దీంతో అవి ఆగ్నేయ నగరం సచియోన్‌లోని పర్వతంపై కూలిపోయినట్లు చెప్పారు.