అమెరికాలో మరోసారి  కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాగా... ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ ఏఅండ్ఎం వర్సీటీలో ఓ అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే... వారు విద్యార్థులా.. లేక స్థానిక పౌరులా అన్న విషయం చెప్పడానికి పోలీసులు నిరాకరించారు.

Also Read తల్లి రెండో పెళ్లి, బాలికపై తండ్రి, తాత అఘాయిత్యం

ఈ ఘటనలో ఓ చిన్నారి కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంది అన్న విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తుపాకీ లైసెన్స్ కలిగిన వ్యక్తే కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏఅండ్ఎం వర్సిటీలో సుమారు 1600మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు వర్సిటీ గదుల్లోనే ఉండాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.