అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. డల్లాస్ నగరంలో నిర్వహించిన ఎయిర్ షోలో రెండు యుద్ధ విమానాలు ఢీకొన్నాయి. అందరూ చూస్తుండగా.. వీడియోలు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

న్యూఢిల్లీ: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు ఆకాశంలో ఢీకొట్టుకున్నాయి. బోయింగ్ బీ-17 బాంబర్ యుద్ధ విమానం, పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానం రెండూ ఢీకొన్నాయి. అమెరికాలో టెక్సాస్‌లోని డల్లాస్‌లో వైమానిక ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ రెండు విమానాల్లోని పైలట్ల ఆరోగ్య వివరాలపై ఇంకా సమాచారం అందలేదు. వైమానిక ప్రదర్శన కావడంతో చాలా మంది సెల్ ఫోన్‌లలో ఆ విన్యాసాలను బంధించాలని అనుకున్నారు. ఇదే సందర్భంలో రెండు విమానాలు ఢీకొట్టుకోవడంతో ఆ ప్రమాదం చాలా మంది వీక్షకుల మొబైల్ ఫోన్‌లలో రికార్డు అయింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రమాదలో పైలట్ల గురించిన సమాచారం ఇంకా నిర్దారించలేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) వెల్లడించింది. ఎయిర్ ఫోర్స్ వింగ్స్ స్మారకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తును ప్రారంభించనుంది.

Scroll to load tweet…

Also Read: గ‌గ‌న‌తలంలో రెండు విమానాలు ఢీ.. ముగ్గురు మృతి.. ఎక్క‌డంటే ?

ఈ ఘటనపై డల్లాస్ మేయర్ ఎరిక్ జాన్సన్ ట్వీట్ చేశారు. అయితే, చాలా విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నదని, ధ్రువీకరణ చేయాల్సి ఉన్నదని వివరించారు. ఈ రోజు మన నగరంలో నిర్వహించిన ఎయిర్ షోలో జరిగిన దారుణ విషాదాన్ని మీరంతా వీక్షించారని పేర్కొన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన చాలా వివరాలను ఇంకా ధ్రువీకరించాల్సి ఉన్నదని, ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉన్నదని వివరించారు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఈ ప్రమాద స్థలాన్ని అదుపులోకి తీసుకుంది. డల్లాస్ పోలీసు డిపార్ట్‌మెంట్, డల్లాస్ ఫైర్ రెస్క్యూ ఈ ప్రమాద ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యల్లో మునిగిపోయిందని తెలిపారు.

Scroll to load tweet…

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బీ-17 యుద్ధ విమానం కీలక పాత్ర పోషించింది. జర్మనీపై విజయం సాధించడంలో ఈ బోయింగ్ విమానం అద్భుత పాత్ర నిర్వర్తించింది.

Scroll to load tweet…

ఇదే సమయంలో పీ 63 కింగ్ కోబ్రా యుద్ధ విమానాన్ని తయారుచేశారు. ఈ చిన్న విమానాన్ని సోవియెట్ ఎయిర్ ఫోర్స్‌కు వ్యతిరేకంగా మాత్రమే వినియోగించారు.