Asianet News TeluguAsianet News Telugu

చిలీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, 400 ఇల్లు ధ్వంసం..

చిలీలోని రిసార్ట్ టౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారు. వేగంగా వ్యాపిస్తున్న మంటలకు 400 ఇండ్లు దెబ్బతిన్నాయి.

Two Dead, 400 Homes Damaged In Chile Resort Town Fire
Author
First Published Dec 23, 2022, 12:53 PM IST

చిలీ : చిలీ సముద్రతీర రిసార్ట్ వినా డెల్ మార్‌లో గురువారం సంభవించిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దాదాపు 400 ఇండ్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మంటలకు బలమైన గాలులు తోడవడంతో పట్టణంలోని ఎగువ ప్రాంతాల నుండి లోయలు, కొండల నుండి కొన్ని గంటల వ్యవధిలోనే శాంటియాగో నుండి 120 కిలోమీటర్ల (75 మైళ్ళు) దూరంలో ఉన్న నగరంలోని అత్యల్ప, అత్యంత జనావాస ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. 

మంటలు వేగంగా వ్యాపించడం, అధిక వేడి, వేగంగా విస్తరించడం వల్ల ఇప్పటికే దాదాపు 110 హెక్టార్లు (270 ఎకరాలు) దగ్ధమయ్యాయని జాతీయ అత్యవసర కార్యాలయం (ఒనెమి) తెలిపింది. ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సమీప ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

అగ్నిప్రమాదం కారణంగా చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వినా డెల్ మార్ ఉన్న వాల్పరైసో ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదాన్ని ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలని రిపబ్లిక్ అధ్యక్షుడు ఆదేశించారు.. అని సహాయ కార్యదర్శి మాన్యువల్ మోన్సాల్వే చెప్పారు.

కదులుతున్న రైలులో మహిళ మీద దాడి చేసిన వ్యక్తి.. పిడిగుద్దులు కురిపిస్తూ.. వీడియో వైరల్...

"మంటలు అంటుకోవడంతోనే చాలా స్పీడ్ గా వ్యాపించడం మొదలుపెట్టాయి. దీనికి తోడు మంటలు అంటున్న ప్రదేవం, అక్కడి వాతావరణ పరిస్థితులు, గాలి, చుట్టు పక్కల మంటలకు అనుకూలమైన పదార్థాల ఉనికి ఫలితంగా, మంటలు చాలా  దూకుడుగా, త్వరగా వ్యాపించింది," అని మోన్సాల్వే అన్నారు.

గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల (25 నుండి 30 మైళ్ళు) వేగంతో వీచిన గాలుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. దీనివల్ల అగ్నిమాపక సిబ్బంది, అటవీ రేంజర్‌ల పని క్లిష్టతరం అయ్యింది. మంటలను అదుపు చేయడానికి శాంటియాగో మెట్రోపాలిటన్ ప్రాంతానికి చెందిన అనేక యూనిట్లతో పాటు నాలుగు వందల మంది అగ్నిమాపక సిబ్బంది, 150 మంది అటవీ రేంజర్లు పని చేస్తున్నారు.

ఇక ఈ అగ్నిప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తుల మరణించారని నగర అగ్నిమాపక కమాండర్, ప్యాట్రిసియో బ్రిటో ధృవీకరించారు. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు దెబ్బతిన్న ఇండ్ల సంఖ్యను  200 నుంచి 400కి చేరిందని తెలిపారు. 

"న్యూవా ఎస్పెరాన్జా 2000 అనే ప్రాంతంలో మంటలు ప్రారంభమయ్యాయి," అని నగర మేయర్ తెలిపారు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన వారిని, మృతుల కుటుంబాలను తాము వదిలిపెట్టమని... సాయంగా ఉంటామని బోరిక్ బాధితులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. "చిలీ ప్రభుత్వంగా మా ప్రాధాన్యత ప్రజల భద్రత, అత్యవసర పరిస్థితులను నియంత్రించడానికి అవసరమైన అన్ని వనరులను మోహరించడమే" అని ఆయన చెప్పారు. మంటలను అదుపు చేసేందుకు కనీసం రెండు రోజులు పడుతుందని చిలీ జాతీయ అటవీ సేవ, కోనాఫ్‌కు చెందిన వాల్‌పరైసో డైరెక్టర్ లూయిస్ కొరియా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios