ఫసిఫిక్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

https://static.asianetnews.com/images/authors/231f1fbd-3d04-50bf-b279-20df9819b018.jpg
First Published 5, Dec 2018, 1:58 PM IST
tsunami alret in pacific island
Highlights

ఫసిఫిక్‌ మహాసముద్రంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. వనౌటు, న్యూ కలెడోనియా దీవుల్లో ఉదయం రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూప్రంకపనలు సంభవించాయి. 

ఫసిఫిక్‌ మహాసముద్రంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. వనౌటు, న్యూ కలెడోనియా దీవుల్లో ఉదయం రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూప్రంకపనలు సంభవించాయి. దీంతో ఆస్ట్రేలియాకు తూర్పు దిక్కుగా వున్న దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

న్యూకలెడోనియాకు చెందిన లాయాలిటీ దీవులకు ఆగ్నేయంగా 155 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్ల సమీపంలో సునామీ ప్రభావం ఉండే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సునామీ హెచ్చరికల నేపధ్యంలో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

loader