ఏనుగెక్కాలని ఒక్కసారైనా అనుకోని వారు ఉండరు. సరదాగా ఏనుగు అంబారీ ఎక్కి ఊరేగాలని అనుకుంటారు. అయితే రష్యాలోని ఓ యువతికి కూడా ఇలాంటి కోరికే ఉంది. కోరిక తీర్చుకుంది కూడా.. కాకపోతే ఒంటి మీద నూలుపోగు లేకుండా ఏనుగు ఎక్కి దానిమీద పడుకుంది.  

రష్యాకు చెందిన అలెస్య కఫెల్కికోవా అనే మోడల్ నగ్నావతారంలో సుమత్రా ఏనుగు మీదీకి ఎక్కింది. పైగా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి తన ఇన్ స్ట్రాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన జనాలు తిట్ల దండకం అందుకున్నారు. 

జంతు ప్రేమికులైతే.. ఛీ..ఛీ.. ఏం చేస్తున్నావో తెలుస్తోందా? అంటూ ముక్కుచీవాట్లు పెట్టారు. అంతేకాదు ముందు గజరాజు మీదినుంచి కిందికి దిగు, నీ నగ్న ఫొటో షూట్లు, వీడియోలకు ఇంకేదైనా మార్గం వెతుక్కో, మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా?? నిన్ను బట్టలు లేకుండా చూడాలని ఇక్కడ ఎవరైనా తహతహలాడుతున్నారా? ఏంటా పిచ్చి వేషాలు? అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు.

ఆ ఏనుగును చూస్తే జాలేస్తోంది. ఆ అవతారంలో దాని మీద ఎక్కినందుకు నీకు సిగ్గనిపించట్లేదా? అయినా డబ్బు మనుషుల్ని ఎంతకైనా దిగజార్చుతుంది.. అంటూ చెడా మడా తిట్ల వర్షం కురిపించారు. నెటిజన్ల ఈ రెస్పాన్స్ చూసిన ఆమె వెంటనే ఆ వీడియోను తీసేసింది. 

అంతేకాదు ఏనుగులంటే తనకెంతో ఇష్టమని, అందుకే ఇలాంటి ఫొటోషూట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. కొన్నేళ్లుగా ఛారిటీ కోసం పని చేస్తున్నానని, అందులో భాగంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం కూడా విరాళాలు ఇచ్చానని తెలిపింది. 

తన ఫొటో అభ్యంతరంగా అనిపించినందుకు క్షమాపణలు చెప్పింది. ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు యెవ్ గెనీ కఫెల్నికోవ్‌ కూతురే ఈ అలెస్య. 2015లో మోడల్ గా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్లు ఎల్లీ, వోగ్ కవర్‌ పేజీలపై కూడా ఆమె ఫొటోలు ప్రచురితమయ్యాయి.