Asianet News TeluguAsianet News Telugu

హెచ్4 వీసా రద్దు..! భారతీయులు ఇక ఇంటికే..

ట్రంప్ అధిష్టానం తాజాగా మరోసారి H-1B, H4 వీసా విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చింది.

Trump administration plans to rescind H-4 EAD visa

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వలసదారుల (ఇమిగ్రెంట్స్) విషయంలోనూ అలాగే వీసా నిబంధనలను కఠినతరం చేసే విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. 

ట్రంప్ అధిష్టానం తాజాగా మరోసారి H-1B, H4 వీసా విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చింది.  అమెరికాలో H-1B వీసా కలిగి ఉండి, వారి వెంట వచ్చే డిపెండెంట్స్ విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

సాధారణంగా అమెరికాలో H-1B వీసా కలిగి ఉన్న వ్యక్తులు తమ భార్యను లేదా భర్తను డిపెండెంట్ వీసాపై ఆ దేశంలోకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇలా డిపెండెంట్ వీసా(H4)పై వచ్చే కొందరు వ్యక్తులు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) పొంది ఆ దేశంలో అధికారంగా ఉద్యోగం చేసుకోవచ్చు. 

ఈ విధానం వలన అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారనే నెపంతో H4 వీసాను రద్దు చేసే విషయమై  ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కసరత్తులు చేస్తోంది. ఇదే గనుక జరిగితే అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోవటమే కాకుండా, ఆ దేశాన్ని విడచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది.

"ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కోసం అర్హత కలిగిన విభాగం నుంచి H4 డిపెండెంట్ జీవితభాగస్వాములను తొలగిస్తున్నాం" అని అమెరికా ఆంతరంగిక భద్రతా విభాగం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

గతంలో ఒబామా అధికారంలో ఉన్నప్పుడు (2015లో) న్యాయబద్ధమైన శాశ్వత నివాస స్థితి (LPR Status)లో ఉన్న H1-B వీసా ఉద్యోగుల జీవితభాగస్వాములు కూడా ఇక్కడే ఉద్యోగం చేసుకునేందుకు అనుమతులు జారీ చేస్తూ అదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వాటిని రద్దు చేసే పనిలో పండింది. 

అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని, ప్రస్తుతం కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతోందని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) చెబుతున్నప్పటికీ, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టమవుతోంది. అమెరికా వస్తువులనే కొనండి, అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వండి అని ప్రెసిడెంట్ ట్రంప్ గతంలో అనేకసార్లు చెప్పిన విషయం తెలిసినదే. ఈ వీసా మార్పు అమల్లోకి వస్తుందని  మీరు భావిస్తున్నారా ? కామెంట్ల రూపంలో మాకు తెలియజేయగలరు.

Follow Us:
Download App:
  • android
  • ios