Asianet News TeluguAsianet News Telugu

హెచ్1 బీ వీసా : టెకీలకు మరో షాక్.. అంత ఈజీ కాదంటున్న ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1 బీ వీసాల మీద మరో నిర్ణయం తీసుకున్నాడు. భారతీయ టెక్కీలకు ఇది పెద్ద షాక్ గా మారింది. హెచ్ 1 బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసే అంశంపై మరోసారి దృష్టిపెట్టారు. హెచ్1బీ వీసాలను పరిమితం చేసే లక్ష్యంలో భాగంగా ట్రంప్  సరికొత్త ఆదేశాలతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Trump administration announces new rules that restrict H-1B visa in a blow to Indian tech workforce - bsb
Author
Hyderabad, First Published Oct 7, 2020, 10:19 AM IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1 బీ వీసాల మీద మరో నిర్ణయం తీసుకున్నాడు. భారతీయ టెక్కీలకు ఇది పెద్ద షాక్ గా మారింది. హెచ్ 1 బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసే అంశంపై మరోసారి దృష్టిపెట్టారు. హెచ్1బీ వీసాలను పరిమితం చేసే లక్ష్యంలో భాగంగా ట్రంప్  సరికొత్త ఆదేశాలతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

దేశానికి చట్టబద్దమైన వలసలను అరికట్టడం స్థానికీకరణ, అమెరికా ఉద్యోగులను రక్షించేందుకు మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసారు. యుఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్  ఈ మేరకు చర్యలు తీసుకుంటుందని  హోంల్యాండ్ సెక్యూరిటీ  విభాగం (డిహెచ్ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. 

హెచ్1బీ వీసా కు సంబంధించి గత 20 ఏళ్లలో చేసిన ముఖ్యమైన సంస్కరణ ఇది అని లేబర్ డిప్యూటీ సెక్రటరీ ప్యాట్రిక్ పిజ్జెల్లా వెల్లడించారు. ఈ ఆంక్షలు గురువారం నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉందనీ,  ఈ నిర్ణయం హెచ్1 బీ వీసాల  పిటీషన్లలో మూడవ వంతు ప్రభావితం చేయనుందని విశ్లేషకుల అంచనా.
కొత్త  ఆంక్షల్లో మూడు ప్రధాన అంశాలున్నాయి. మొదటిది అమెరికన్ల స్థానంలో ఇతర ఐటీ నిపుణులు అవసరమని నిరూపించాల్సి ఉంటుంది. దీనికోసం  హెచ్1బీ వీసా జారీ చేసేందుకు అదనపు డాక్యుమెంటేషన్ అవసరం. ఐటీ నిపుణుల నియామాలకోసం ఆధారపడే థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ కంపెనీలపై స్క్రూటినీ మరింత పెంచుతారు. 
హెచ్1బీ  వీసా జారీ ముందు, ఆ తరువాత వర్క్‌సైట్ తనిఖీకి, సమ్మతికి  డీహెచ్ఎస్         కు ఎక్కువ అధికారాలు కల్పిస్తారు.
 
అంతేకాదు ఈ తాజా రూల్  హెచ్1బీ  వీసా ఉద్యోగాలను, కనీస వేతన స్థాయిలను కూడా మార్చే అవకాశం ఉంది. ఇది భారతీయ టెక్ నిపుణులను, టెక్ సంస్థలను భారీగా ప్రభావితం చేస్తుందని, హెచ్1బీ వీసా పొందడం మరింత కఠినం చేస్తుందని అంచనా. అయితే తాజా  నిబంధనలపై టెక్ సంస్థలనుంచి వ్యాజ్యాలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హెచ్1 బీ వీసాలను పరిమితం చేసే ట్రంప్ సర్కార్  ఆంక్షల అమలును నిలిపివేస్తూ  గతంలో ఫెడరల్ కోర్టులు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios