అప్పుడప్పుడు మన ఊహకి కూడా అందని వింతలు జరుగుతూ ఉంటాయి. ఒక రోడ్డు ప్రమాదంలో తల్లి గర్భంలోంచి ఎగిరిపడ్డ ఓ శిశివు ప్రాణాలతో బయటపడటం అక్కడి వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. బ్రెజిల్‌లో చెక్కల లోడుతో వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఓ నిండుచూలాలు కూడా చిక్కుకుంది.

చెక్క ముక్కలు ఆమెపై పడటంతో ఆ బరువుకు మహిళ కడుపుపై ఒత్తిడిపడింది.. దీంతో శిశివు గర్భంలోంచి ఎగిరి కొద్ది దూరంలో పడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లి అక్కడికక్కడే మరణించగా.. ప్రమాదాన్ని గమనించి అక్కడికి చేరుకున్న స్థానికులకు ఆడబిడ్డ ఏడుపు వినిపించింది.. సరిగా కళ్లు కూడా తెరవని ఆ బిడ్డ అంత ఎత్తున ఎగిరిపడినా ప్రాణాలతో బయటపడటంతో ఆ పాపను మృత్యుంజయురాలిగా అభివర్ణిస్తున్నారు.