రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్‌కు ఊహించని షాక్ తగిలింది. రష్యాకు చెందిన రష్యాకు చెందిన మేజర్ జనరల్ అండ్రీ సుఖోవిట్‌స్కీ హతమైనట్లుగా బెలారస్ మీడియా వెల్లడించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

రష్యా - ఉక్రెయిన్ (russia ukraine war) యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధంలో రష్యాకు చెందిన మేజర్ జనరల్ అండ్రీ సుఖోవిట్‌స్కీని ( Andrei Sukhovetskiy ) ఉక్రెయిన్ సేనలు హతం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బెలారస్ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. 

మరోవైపు.. ఉక్రెయిన్‌‌‌‌లో రష్యా విధ్వంసం కొనసాగుతున్నది. గత కొద్ది రోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ఆపేందుకు ఇతర దేశాలు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఈ యుద్ధం మాత్రం ఆగడం లేదు. కాగా.. ఉక్రెయిన్ లోని నగరాలను స్వాధీనం చేసుకునే దిశగా.. రష్యా చర్యలు చేపట్టింది. కాగా.. ఇప్పటికే దక్షిణాన క్రిమియాకు దగ్గర్లో ఉన్న పోర్ట్ సిటీ ‘ఖెర్సన్’ను రష్యన్ దళాలు ఆక్రమించుకున్నాయి. 

భీకర యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌‌‌‌లోని ఓ మేజర్ సిటీని రష్యా తమ అధీనంలోకి తెచ్చుకుంది.ఉక్రెయిన్ లోని అతి పెద్ద నగరం ఇదే కావడం గమనార్హం. నిన్న రాత్రి ఆ న‌గ‌ర వీధుల్లో ఉన్న ర‌ష్యా బ‌ల‌గాలు.. ఖేర్స‌న్ రైల్వే స్టేష‌న్‌ను, పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ నగర మేయర్ ధ్రువీకరించారు.

మెలిటొపోల్‌‌‌‌ను దాదాపు అదుపులోకి తెచ్చుకునే స్థాయిలో ఉండగా.. మరియుపోల్, ఒడెస్సా, ఖార్కివ్ సిటీలపై దాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈశాన్యంలోని ఖార్కివ్‌‌‌‌పై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌ దగ్గరకు బలగాలు చేరుకుంటున్నాయి. సిటీ శివార్లలో జరుగుతున్న పోరులో భారీగా ప్రాణనష్టం జరుగుతున్నది.

మ‌రో వైపు ఖార్కివ్ (kharkiv) న‌గ‌రంపై ర‌ష్యా దాడులు కొన‌సాగిస్తూనే ఉన్న‌ది. తాజాగా ఖార్కివ్ పోలీసు బిల్డింగ్‌పై మిస్సైల్ అటాక్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. సిటీలో ఉన్న పోలీసు డిపార్ట్‌మెంట్ బిల్డింగ్‌ను క్షిప‌ణితో పేల్చేసిన‌ట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. పోలీసు బిల్డింగ్ పూర్తిగా మంట‌ల్లో ద‌గ్ద‌మైన‌ట్లు ఓ వీడియో రిలీజైంది. క‌రాజిన్ నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీలో ఉన్న ఓ బిల్డింగ్ కూడా ధ్వంస‌మైన‌ట్లు ఆ దేశ కేంద్ర హోంశాఖ వెల్ల‌డించింది.