Titan Tragedy: అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన మినీ సబ్ మెరైన్ టైటాన్ కుప్పకూలింది. ఈ ఘటనపై టైటానిక్' చిత్ర దర్శకుడు జేమ్స్ కెమరూన్ కూడా స్పందించారు.
Titan Tragedy: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టైటానిక్ నౌక శిథిలాలను చూపించేందుకు వెళ్లిన టైటాన్ అనే సబ్ మెరైన్ కుప్పకూలింది. ఈ ఘటనలో 5 మంది బిలియనీర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. గత నాలుగు రోజులుగా ఎదురుచూసిన ప్రయాణీకుల మరణ వార్త గురువారం వచ్చింది. రెస్క్యూ బృందాలు టైటానిక్ ఓడ యొక్క శిధిలాల సమీపంలో సబ్‌మెర్సిబుల్ యొక్క బయటి భాగాలను కనుగొన్నాయి. 'టైటాన్' జలాంతర్గామిలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు మరణించారని ఈ ట్రావెల్ సబ్‌మెరైన్‌ను నడుపుతున్న ఓసిగేట్ కంపెనీ తెలిపింది. ఈ ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరమనీ. ఇందుకు తాము చాలా చింతిస్తున్నామని సంస్థ ప్రకటించింది.
తాజాగా జలాంతర్గామి ప్రమాదంపై హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ సంతాపం వ్యక్తం చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను కూడా షాక్ అయ్యాననీ, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఈ సంఘటన ఎన్నాళ్లయినా మరచిపోలేని భయంకరమైన కల లాంటిదని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, 'ప్రయాణికులను తీసుకెళ్లేందుకు తాము చేస్తున్న పని చాలా ప్రయోగాత్మకంగా ఉందని పలువురు సబ్‌మెరైన్ ఇంజనీర్ల బృందం కంపెనీకి లేఖ రాసింది. దీన్ని తనిఖీ చేసి పరీక్షించాల్సిన అవసరం ఉందని హెచ్చరించినట్లు జేమ్స్ పేర్కొన్నాడు.
ఈ ప్రయాణం చాలా ప్రమాదకరమని తెలిపారు. ఆనాటి టైటానిక్ విపత్తు, తాజా జలాంతర్గామి విపత్తుల మధ్య సమాంతరాలు ఉన్నాయని తెలిపారు. రాబోయే మంచు గురించి టైటానిక్ కెప్టెన్‌ను పదేపదే హెచ్చరించారని, అయితే టైటానిక్ పూర్తి వేగంతో కదులుతూనే ఉందని, ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. మీకు తెలుసా.. జేమ్స్ కామెరాన్ స్వయంగా టైటానిక్ శిధిలాలను చూడటానికి 33 సార్లు లోతైన సముద్రంలోకి దిగారు. 1997లో అదే పేరుతో సినిమా కూడా తీశాడు. ఈ ఘటనను 111 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ ఓడతో పోల్చారు దర్శకుడు. ఆ సమయంలో 1500 మందికి పైగా చనిపోయారు.
ఓసింగేట్ కంపెనీ కూడా అదే విధంగా హెచ్చరికలను ఖాతరు చేసిందని, ఫలితం మనందరి ముందు ఉందని.. 100 ఏళ్ల తర్వాత ఇదే స్థలంలో ఇదే ఘటన జరగడం విస్మయానికి గురిచేస్తోందని జేమ్స్ అన్నారు. టైటానిక్ విపత్తుకు, తాజా పరిణామానికి ఉన్న సారూప్యతలు తనని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. టైటాన్ జలాంతర్గామిలో ఉన్న ఐదుగురిలో ఒకరైన పాల్ హెన్రీ నాజియోలెట్.. తనకు మంచి స్నేహితుడని తెలిపారు. అతడు ఈ ప్రమాదంలో మరణంతో ఈ సంఘటన మరింత బాధాకరంగా ఉందని అన్నారు. పాల్ హెన్రీ నాజియోలెట్ తనకు 25 ఏళ్ల స్నేహం ఉందని తెలిపారు.
జలాంతర్గామిలో ప్రయాణించిన వారిలో బ్రిటీష్ వ్యాపారవేత్త. వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ (58) ఏవియేటర్, అంతరిక్ష యాత్రికుడు , దుబాయ్‌కి చెందిన యాక్షన్ ఏవియేషన్ ఛైర్మన్ హమీష్ హార్డింగ్, బ్రిటిష్-పాకిస్థానీ వ్యాపారవేత్త ప్రిన్స్ దావూద్ , అతని కుమారుడు సులైమాన్ కూడా ప్రయాణీకుల జాబితాలో ఉన్నారు. అలాగే ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) స్టాక్‌టన్ రష్ ఉన్నారు.
టైటానిక్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టీమ్ ఇంజిన్ ప్యాసింజర్ షిప్. ఇది అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా తన తొలి ప్రయాణానికి బయలుదేరిన నాలుగు రోజుల తర్వాత ప్రమాదకరమైన మంచుకొండను ఢీకొన్న తర్వాత ఏప్రిల్ 1912లో మునిగిపోయింది. 2021 సంవత్సరంలో రోడ్ ఐలాండ్ తీరానికి సమీపంలో దాని శిధిలాలు కనుగొనబడ్డాయి.
