వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

టెక్సాస్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారంతా ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. .ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సందర్శించారు. మరణించిన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం పంపారు.మరణించినవారంతా మహబూబ్ నగర్ జిల్లాలోని మరికల్ వాసులుగా గుర్తించారు.

జిల్లాలోని మరికల్ మండలంలోని పెద్దచింతకుంటకు చెందిన నరసింహారెడ్డి దంపతులు అమెరికాకు వెళ్లారు. కరోనా కారణంగా వారంతా అమెరికాలోనే ఉండాల్సి వచ్చింది, వీసా జారీకి ఆలస్యం కావడంతో వారంతా అక్కడే ఉన్నారు. 

కూతురు మౌనికకు పెళ్లి సంబంధం చూసేందుకు నరసింహారెడ్డి దంపతులు అమెరికాకు వెళ్లారు. టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహారెడ్డి దంపతులతో పాటు వారి కొడుకు భరత్ కూడా మరణించాడు.ఈ ప్రమాదంలో నరసింహారెడ్డి కూతురు మౌనిక తీవ్రంగా గాయపడింది.

ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.