ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే  చాలు.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతోందో అందరికీ తెలిసిపోతోంది. కాగా.. ఈ ఇంటర్నెట్ ప్రపంచానికి తాజాగా ఓ రారాజు పుట్టుకువచ్చాడు. 100 రోజుల పిల్లాడిని  ఇప్పుడు.. ఇంటర్నెట్ ప్రపంచం రాజుని చేసింది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ.. తన మేనల్లుడి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కొరియన్ సాంప్రదాయం ప్రకారం.. పుట్టిన బిడ్డకు 100రోజుల తర్వాత వేడుక చేస్తారు. మనదగ్గర మొదటి పుట్టిన రోజు ఎలా గ్రాండ్ గా చేస్తారో వాళ్లు.. అలా 100వ రోజున అలా చేస్తారు. అలా చేసిన వేడుక ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. బాలుడి ఫోటోస్ వైరల్ అయ్యాయి. 

కాగా.. ఆ బాలుడి ఫోటోలకు 4.6లక్షల లైక్ లు, వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. బాబు చాలా బాగున్నాడంటూ అందరూ ప్రశంసలుకురిపించారు. బుల్లి కింగ్ సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపించాడు. బాబు చూడటానికి చాలా ముద్దుగా ఉండటంతో.. అందరికీ తెగ నచ్చేశాడు.