అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం సాధించారు. కాగా..అమెరికా ప్రథమ మహిళగా ప్రస్తుతం జిల్ బైడెన్ ప్రస్తుతం గుర్తింపు పొందారు. కాగా.. మాజీ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కి.. ప్రస్తుత ప్రథమ మహిళ జిల్ బైడెన్ కి కామన్ పాయింట్స్ ఏమీ లేవు అదేవిధంగా..  ఇవాంకా ట్రంప్ కి.. బైడెన్ కుమార్తె  ఆషే బైడెన్ కూడా చాలా భిన్నమని తెలుస్తోంది.

బైడెన్ కి జిల్ బైడెన్ తో 1977లో న్యూయార్క్ లో పెళ్లి చేసుకున్నారు.  వీరి కుమార్తె ఆష్లీ 1981లో జన్మించారు. ఆమె న్యూ ఓర్లీన్స్ తులాన్ విశ్వవిద్యాలయంలో సాంస్కృతిక మానవ శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించింది.  ఆష్లీ గ్రాడ్యుయేషన్ తర్వాత కొన్ని నెలలు పిజ్జా పార్లర్‌లో పనిచేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో.. ఆష్లీ తన తండ్రితో కలిసి ప్రచారంలో పాల్గొంది. తన తండ్రి తనతో ఎలా ఉంటాడో.. వారిద్దరూ కలిసి ఎలా అభిప్రాయాలు పంచుకుంటారనే విషయాన్ని కూడా ఆమె ప్రచారంలో ప్రస్తావించడం గమనార్హం. 

ఆష్లేని కార్యకర్తగా మార్చడంలో జో బైడెన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2014 లో ఆమె డెలావేర్ సెంటర్ ఫర్ జస్టిస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

ఆమె ఎల్లప్పుడూ ప్రజల దృష్టికి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రైవేట్‌గా ఉంది మరియు ఆమె బహిరంగ కార్యక్రమాలకు హాజరవ్వడం కూడా పెద్దగా ఇష్టం ఉండదు.

తన తండ్రి బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్న విషయం తెలియగానే ఆష్లే ఆనందంతో డ్యాన్స్ చేశారు. దీని ద్వారా ఆమెలోని డ్యాన్స్ ప్రతిభ అందరికీ తెలిసింది. ఆ డ్యాన్స్ వీడియో వైరల్ కూడా అయ్యింది.